పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14/G35


సద్భావముతో తీసుకొవిన చర్యకు రక్షణ.

28. ఈ చట్టము లేదా దానిక్రింద చేయబడిన ఏవేని నియమములు లేదా ఉత్తర్వులను పురస్కరించుకొని సద్భావముతో చేసిన లేదా చేయుటకు ఉద్దేశించిన దేనికైనను కేంద్ర ప్రభుత్వము పై, రాజ్య ప్రభుత్వములపై లేదా స్థానిక ప్రాధికార సంస్థపై లేదా ప్రభుత్వము యొక్క ఎవరేని అధికారిపై ఎట్టి దావా, అభియోగము లేదా ఇతర శాసనిక చర్య ఉండరాదు.

ఇబ్బందులను తొలగించుటకు అధికారము.

29.ఈ చట్టపు నిబంధనలను అమలు చేయుటలో ఏదేని ఇబ్బంది ఏర్పడినచో, రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో ప్రచురించబడిన ఉత్తర్వు ద్వారా ఈ చట్టపు నిబంధనలకు అసంగతముగా లేనంత మేరకు అట్టి ఇబ్బందులను తొలగించుటకు, తాను ఆవశ్యకమని లేక ఉపయుక్తమని భావించునట్టి నిబంధనలను చేయవచ్చును: అయితే, ఈ చట్టము ప్రారంభమైన తేదీ నుండి రెండు సంవత్సరముల కాలావధి ముగిసిన తరువాత అట్టి ఏ ఉత్తర్వును చేయరాదు.

ఆదేశము లిచ్చుటకుకేంద్ర ప్రభుత్వమునకుఅధికారము.

30. ఈ చట్టపు నిబంధనలను అమలుపరచుటకు కేంద్ర ప్రభుత్వము రాజ్య ప్రభుత్వమునకు ఆదేశములీయవచ్చును.


పునర్విలోకనం చేయుటకు కేంద్ర ప్రభుత్వమునకు అధికారము.

31. రాజ్య ప్రభుత్వములచే ఈ చట్టపు నిబంధనల అమలు పురోగతిని కేంద్ర ప్రభుత్వము నియతకాలికంగా పునర్విలోకనం చేయవచ్చును. మరియు పర్యవేక్షించ వచ్చును.

నియమములు చేయుటకురాజ్య ప్రభుత్వమునకుఅధికారము.

32.(1) ఈ చట్టము నిమిత్తము రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధి సూచన ద్వారా నియమములు చేయవచ్చును

(2) పైన పేర్కొనబడిన అధికారము యొక్క సాధారణ వ్యాపకతకు భంగము కలుగకుండ అట్టి నియమములు ఈ క్రింది విషయముల కొరకు నిబంధించ వచ్చును,

(ఎ) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1) క్రింద విహితపరచబడినట్టి నియమ ములకు అధ్యదీనమై, 5వ పరిచ్ఛేదము క్రింద విచారణ జరుపు రీతి;

(బి) 8వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద ట్రిబ్యునలు యొక్క అధికారము మరియు ఇతర ప్రయోజనముల కైన ప్రక్రియ;

(సి) 9వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (2) క్రింద ట్రిబ్యునలుచే ఉత్తర్వు చేయబడు గరిష్ట భరణ పోషణభత్యము;