పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/15

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13/G34


(2) ఎస్టేటు నుండి భరణపోషణను పొందుటకు ఎవరేని వయోవృద్ధ పౌరుడు హక్కు కలిగి వుండి మరియు అట్టి ఎస్టేటు లేదా దానిలోని భాగము అంతరణ చేయబడినపుడు అంతరణ స్వీకర్తకు ఆ హక్కు గురించి లేదా అంతరణ ప్రతిఫలరహితమైనదని తెలిసియున్న యెడల భరణ పోషణ పొందు హక్కును అంతరణ స్వీకర్త పై అమలుచేయవచ్చును; అయితే ప్రతిఫలం కొరకు మరియు హక్కు గురించి అతనికి తెలియకుండా వున్న యెడల అంతరణ స్వీకర్త పై అమలు చేయరాదు. (3) ఎవరేని వయోవృద్ధ పౌరుడు ఉప-పరిచ్ఛేదములు (1) మరియు (2)ల క్రింద హక్కులను అమలు చేయుటలో అసమర్ధ డైన యెడల, 5వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లోని విశదీకరణలో నిర్దేశించబడిన వ్యవస్థ ఏదైనను అతని తరఫున చర్య తీసుకోవచ్చును.

అధ్యాయము -- VI

విచారణ కొరకు అపరాధములు మరియు ప్రక్రియ.

వయోవృద్ధ పౌరుని పట్టించుకోకుండా వదిలివేయుట మరియుపరిత్యజించుట.

24. వయోవృద్ధ పౌరుని సంరక్షణ లేదా రక్షణ బాధ్యతను కలిగి ఉండి, అట్టి వృద్ధుడిని పూర్తిగా పరిత్యజించవలెనను ఉద్దేశంతో అతనిని ఏదేని ప్రదేశంలో వదలి వేసిన వారెవరైనను, మూడుమాసముల వరకు విస్తరించగల కాలావధికి కారాగారవాసముతోను లేదా ఐదువేల రూపాయల వరకు విస్తరించగల జరిమానాతోను లేదా రెండింటితోను వంటి ఏదో ఒక విధముతో శిక్షింపబడదగి యుండును.

అపరాధముల సంజ్ఞానము. 1974లో 2వది.

25.(1) క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లో ఏమి ఉన్నప్పటికిని, ఈ చట్టము క్రింది ప్రతి అపరాధము సంజేయమై మరియు జామీను యోగ్యమైనదై యుండును.

(2) ఈ చట్టము క్రింద అపరాధము ఒక మేజిస్ట్రేటుచే సంక్షిప్తంగా విచారింపబడవలెను.

అధ్యాయము - - VII

వివిధములు.

అధికారులు పబ్లికు శేవకులుగా ఉండుట. 1860లోని 45వది.

26.ఈ చట్టము క్రింద కృత్యములను వినియోగించుకొనుటకు నియమించబడిన ప్రతి అధికారి లేదా సిబ్బంది భారత శిక్షా స్మృతిలోని 21వ పరిచ్ఛేదము యొక్క అర్ధములో పబ్లికు సేవకులుగా భావించబడవలెను.

సివిలు న్యాయస్థానములు యొక్క అధికారితా పరిధికి ప్రతిబంధకము.

27. ఈ చట్టపు ఏదేని నిబంధన వర్తించు ఏదేని విషయమునకు సంబంధించి ఏ సివిలు న్యాయస్థానమునకు గాని అధికారిత పరిధి ఉండదు. మరియు ఈ చట్టముచే లేదా దాని క్రింద చేసిన లేదా చేయుటకు ఉద్దేశించిన దేనిపైనైననూ ఏదేని సివిలు న్యాయస్థానము ఎట్టి వ్యాదేశమును మంజూరు చేయరాదు.