పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/14

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12/G33


(ii) ఈ చట్టమునకు సంబంధించిన అంశములపై పోలీసు అధికార్లు మరియు న్యాయిక సేవా సభ్యులతో సహా కేంద్ర ప్రభుత్వము మరియు రాజ్య ప్రభుత్వ అధికారులకు నియతకాలిక సున్నితత్వీకరణ మరియు అవగాహన పై శిక్షణనిచ్చుట; (iii) వయోవృద్ధ పౌరుల సంక్షేమమునకు సంబంధించిన విషయములను అభిభాషిం చుటకు న్యాయ, ఆంతరంగిక వ్యవహారములు, ఆరోగ్య మరియు సంక్షేమము లను నిర్వహించు సంబంధిత మంత్రిత్వ శాఖలు లేదా విభాగములచే కల్పించబడు సర్వీసుల మధ్య ప్రభావవంతమైన సమన్వయము మరియు వాటిపై నియతకాలిక పునర్విలోకనం జరుపబడుట కొరకు అన్ని చర్యలు చేపట్టబడునట్లు చూడవలెను.

ఈ చట్టపు నిబంధనలను అమలుపరచుట కొరకు నిర్దిష్ట పరచబడు ప్రాధికారులు.

22.(1) రాజ్య ప్రభుత్వము, ఈ చట్టపు నిబంధనలు సక్రమముగా నెరవేర్చబడునట్లు చూచుటకు,జిల్లా మేజిస్ట్రేటు పై అవసరమగునట్టి అధికారములను ప్రదత్తము చేయవచ్చును మరియు అట్టి కర్తవ్యములను విధించవచ్చును మరియు జిల్లా మేజిస్ట్రేటు అట్లు తనకు ప్రదత్తము చేయబడిన లేక విధించబడిన అన్నీ లేక వాటిలో ఏవేని కొన్ని అధికారములను వినియోగించుటకు మరియు తనపై ఉంచబడిన 'కర్తవ్యములన్నింటిని లేక వాటిలో ఏవేని కొన్నింటిని నిర్వర్తించుటకుగాను తనకు అధీనస్థమైన అధికారిని మరియు ఆ అధికారిచే విహితపరచబడినట్టి అధికారములు లేదా కర్తవ్యములను నిర్వర్తించబడుటకు స్థానిక పరిధులను నిర్ధిష్ట పరచవచ్చును.

(2) రాజ్య ప్రభుత్వము, వయోవృద్ధ పౌరుని ప్రాణము మరియు ఆస్తిని రక్షించుట కొరకు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను విహితపరచవలెను.

కొన్ని పరిస్థితులలోఆస్తి అంతరణ చెల్లకుండుట.

23.(1) ఈ చట్టపు ప్రారంభము తరువాత, ఎవరేని వయోవృద్ధ పౌరుడు, అంతరణ స్వీకర్త ప్రాధమిక సదుపాయములు మరియు ప్రాధిమిక భౌతిక అవసరములను అంతరణకర్తకు కల్పించవలెననే షరతుకు అధ్యదీనమై, దానము లేదా ఇతర విధముగా తన ఆస్తిని అంతరణ చేసినపుడు మరియు అట్టి అంతరణ స్వీకర్త అట్టి సదుపాయములను మరియు భౌతిక అవసరములను కల్పించుటకు నిరాకరించిన లేదా వాటిని ఏర్పాటు చేయుటలో విఫలమైన యెడల, సదరు ఆస్తి అంతరణ మోసము లేదా బలవంతము లేదా అనుచిత ప్రభావము క్రింద చేయబడినట్లుగా భావించవలెను మరియు అంతరణకర్త అభీష్టం మేరకు దానిని ట్రిబ్యునలుచే చెల్లనిదిగా ప్రఖ్యానించబడవలెను.