పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/12

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10/G31


(4) అపిలేటు ట్రిబ్యునలు, తెప్పించుకొనిన అపీలును మరియు రికార్డులను పరిశీలించిన తరువాత, అపీలును అనుమతించవచ్చును లేదా తిరస్కరించవచ్చును.

(5) ట్రిబ్యునలు ఉత్తర్వు పై దాఖలయిన అపీలు పై అపిలేటు ట్రిబ్యునలు న్యాయ నిర్ణయము చేయవలెను మరియు నిర్ణయించవలెను, మరియు అపిలేటు ట్రిబ్యునలు యొక్క ఉత్తర్వు అంతిమమైనదై ఉండును:

అయితే స్వయముగా లేదా తగువిధముగా ప్రాధికారమీయబడిన ప్రతినిధి ద్వారా ఆకర్ణించబడుటకు ఇరుపక్ష కారులకు అవకాశము ఇచ్చిననే తప్ప ఏ అపీలు నిరాకరించబడరాదు.

(6) అపిలేటు ట్రిబ్యునలు, అపీలు అందిన ఒక మాసము లోపుగా వ్రాతమూలక మైన తన ఉత్తర్వును ప్రకటించుటకు ప్రయత్నించవలెను.

(7) ఉప-పరిచ్ఛేదము (5) క్రింద చేయబడిన ప్రతి ఉత్తర్వు యొక్క ఒక ప్రతిని ఇరుపక్ష కారులకు ఉచితముగా పంపవలెను.

శాసనిక విన్నపము చేయు హక్కు

17. ఏదేని శాసనములో ఏమివున్నప్పటికినీ, ట్రిబ్యునలు లేదా అపిలేటు ట్రిబ్యునలు సమక్షంలో ఉన్న ప్రొసీడింగులో ఏ పక్ష కారుడు న్యాయవాది లేకుండా విన్నపము చేయరాదు.

భరణపోషణాధికారి.

18.(1) రాజ్య ప్రభుత్వము, అతను ఏ పేరుతో పిలువబడినప్పటికినీ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లేదా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హోదాకు తక్కువ కాని అధికారిని భరణ పోషణాధికారిగా పదాభిదానము చేయవలెను. (2) ఉప-పరిచ్ఛేదము (1) నిర్దేశించబడిన భరణ పోషణాధికారి తాను అట్లు భావించిన యెడల, ట్రిబ్యునలు లేదా సందర్భానుసారం అపిలేటు ట్రిబ్యునలు యొక్క ప్రొసీడింగుల సమయంలో తల్లి లేక తండ్రికి ప్రాతినిధ్యం వహించవలెను.

వృద్ధాశ్రమములను స్థాపించుట,

అధ్యాయము - III

వృద్ధాశ్రమములను స్థాపించుట.

19.(1) రాజ్య ప్రభుత్వము, నిరు పేదవారైన వయోవృద్ధ పౌరులకు అందుబాటు స్థలములలో దశలవారీగా తాను అవసరమని భావించునట్టి సంఖ్యలో, ప్రారంభములో అట్టి ఆశ్రమములో నూటయాభై మందికి వసతి కల్పించునట్లుగా కనీసము ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమములను స్థాపించి మరియు నిర్వహించవచ్చును.