పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/11

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9/G30


ఏదేవి క్లెయిమును అనుమతించినపుడు వడ్డీ యొక్క అధి నిర్ణయము..

14.ఈ చట్టము క్రింద చేయబడిన భరణపోషణకై ఏదేని ట్రిబ్యునలు ఉత్తర్వు చేయునపుడు, అట్టి ట్రిబ్యునలు, భరణ పోషణ మొత్తమునకు అదనముగా ఐదు శాతమునకు తక్కువ కాకుండా మరియు పదునెనిమిది శాతమునకు మించకుండా ట్రిబ్యునలుచే నిర్ధారించబడునట్టి రేటులో మరియు దరఖాస్తు చేసిన తేదీ కంటే ముందు కానట్టి తేదీ నుండి సామాన్య వడ్డీని కూడా చెల్లించమని ఆదేశించవచ్చును: అయితే, ఈ చట్టము యొక్క ప్రారంభపు సమయములో క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1974లో 2వది. 1973లోని అధ్యాయము-9 క్రింద భరణ పోషణ కొరకైన ఏదేని దరఖాస్తు న్యాయస్థానము సమక్షములో పెండింగులో ఉన్నపుడు, తల్లి/తండ్రి అభ్యర్ధనపై అట్టి దరఖాస్తును ఉపసంహరించుకొనుటకు న్యాయస్థానము అనుమతించవలెను మరియు అట్టి తల్లి/తండ్రి ట్రిబ్యునలు సమక్షములో భరణపోషణకై దరఖాస్తును దాఖలు చేయుటకు హక్కు కలిగిఉండును.

అప్పిలేటు ట్రిబ్యునలుయొక్క సంఘటన. 15.(1) రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో అధిసూచన ద్వారా, ట్రిబ్యునలు ఉత్తర్వు పై అపీలును ఆకర్ణించుటకుగాను ప్రతి జిల్లాకు ఒక అప్పిలేటు ట్రిబ్యునలును సంఘటిత పరచవలెను. (2) అప్పిలేటు ట్రిబ్యునలుకు జిల్లా మేజిస్ట్రేటు హోదాకు తక్కువకాని అధికారి అధ్యక్షత వహించవలెను. అప్పీళ్లు. 16.(1) ట్రిబ్యునలు ఉత్తర్వు ద్వారా వ్యధితుడైన ఎవరేని వయోవృద్ధ పౌరుడు లేదా సందర్భానుసారం తల్లి/తండ్రి, ఉత్తర్వు తేదీ నుండి అరవై దినముల లోపల, అప్పిలేటు ట్రిబ్యునలులో అపీలు చేయవచ్చును: అయితే, అపీలు వేసిన మీదట, అట్టి భరణపోషణ ఉత్తర్వు ప్రకారం ఏదేని మొత్తమును చెల్లించవలసిన సంతానము లేదా బంధువు, ఆ విధముగా ఉత్తర్వు చేయబడినట్టి మొత్తమును అపిలేటు ట్రిబ్యునలుచే ఆదేశించబడిన రీతిలో అట్టి తల్లి/తండ్రికి చెల్లించుటను కొనసాగించవలెను: అయితే ఇంకను, అపిలేటు ట్రిబ్యునలు, అపీలుదారు గడువులోపుగా అపీలును దాఖలు చేయుట నుండి నివారించబడినాడనుటకు తగిన కారణమున్నదని ట్రిబ్యునలు సంతృప్తి చెందిన యెడల, సదరు అరువది దినముల కాలావధి ముగిసిన తరువాత అపీలును స్వీకరించవచ్చును. (2) అపీలు అందిన మీదట, అపిలేటు ట్రిబ్యునలు ప్రతివాదికి నోటీసును తామీలు చేయబడునట్లు చూడవలెను. (3) ఏ ట్రిబ్యునలులో ఉత్తర్వుపై అపీలు దాఖలు చేయబడినదో దాని నుండి ప్రొసీడింగుల రికార్డును అపిలేటు ట్రిబ్యునలు తెప్పించుకొనవచ్చును.