పుట:తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ, పోషణ మరియు సంక్షేమ చట్టము, 2007.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8/G29


భరణపోషణ బత్తెములో మార్పు.10.01) 9వ పరిచ్ఛేదము క్రింద భరణపోషణ కొరకు నెలవారీ బత్తెము ఆదేశింపబడి ఆపరిచ్ఛేదము క్రింద నెలవారీ బత్తెమును పొందుతున్న ఎవరేని వ్యక్తి యొక్క పరిస్థితులలోని అసత్య వర్ణన లేదా సంగతిని గూర్చిన పొరపాటు లేదా మార్పు రుజువైనపుడు, ట్రిబ్యునలు, భరణపోషణ బత్తెములో తాను సబబని భావించునట్టి మార్పులు చేయవచ్చును.

(2) సమర్ధ సివిలు న్యాయస్థానము యొక్క ఏదేని నిర్ణయము పర్యవసానంగా 9వ పరిచ్ఛేదము క్రింద చేయబడిన ఏదేని ఉత్తర్వు రద్దు చేయబడవలెనని లేదా పరివర్తనము చేయబడవలెనని ట్రిబ్యునలుకు తోచిన యెడల, అది తదనుసారముగా ఆ ఉత్తర్వును రద్దు చేయవలెను లేదా సందర్భానుసారము పరివర్తనము చేయవలెను.

భరణపోషణ ఉత్తర్వునుఅమలుపరచుట. 11.(1) దావా చర్యల ఖర్చులకు సంబంధించిన ఉత్తర్వుతోసహా సందర్భానుసారము భరణపోషణ ఉత్తర్వు యొక్క ప్రతిని, ఎటువంటి ఫీజు చెల్లింపు లేకుండా అది ఎవరి తరఫున చేయబడినదో ఆ వయోవృద్ధ పౌరునికి లేక సందర్భాసుసారము తల్లి/తండ్రికి ఇవ్వవలెను, మరియు బత్తెము లేక సందర్భానుసారము ఖర్చులు, చెల్లించబడని విషయములో మరియు పక్ష కారుల గుర్తింపుకు సంబంధించినంత వరకు అట్టి ట్రిబ్యునలు సంతృప్తి చెందిన మీదట, అట్టి ఉత్తర్వును, ఎవరిపై చేయబడినదో ఆ వ్యక్తి ఉన్న ఏ ప్రాంతములోనైననూ, ఏదేని ట్రిబ్యునలుచే అమలుపరచబడవలెను.


1974లో 2వది. (2) ఈ చట్టము క్రింద చేయబడిన భరణపోషణ ఉత్తర్వు క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973 లోని అధ్యాయము-9 క్రింద జారీచేయబడిన ఉత్తర్వు వలెనే అదే ప్రాబల్యము మరియు ప్రభావము కలిగి ఉండును మరియు దానిని ఆ స్మృతి ద్వారా అట్టి ఉత్తర్వు అమలుకై విహితపరచిన రీతిలోనే అమలు చేయవలెను.


కొన్ని సందర్భములలో భరణ పోషణకు సంబంధించి ఐచ్ఛికత. 1974లో 2వది. 12. క్రిమినలు ప్రక్రియా స్మృతి, 1973లోని అధ్యాయము-9లో ఏమి ఉన్నప్పటికిని సదరు అధ్యాయము క్రింద భరణపోషణ కొరకు హక్కు కలిగి ఉన్న మరియు ఈ చట్టము క్రింద భరణపోషణకు హక్కు కలిగి ఉన్నటువంటి వయోవృద్ధ పౌరుడు లేక తల్లి/తండ్రి, సదరు స్మృతిలోని అధ్యాయము-9 యొక్క నిబంధనలకు భంగము కలుగకుండ, సదరు చట్టములలోని దేని క్రిందనైనా అట్టి భరణ పోషణను క్లెయిము చేయవచ్చును అయితే రెండింటి క్రింద క్లెయిము చేయరాదు.

భరణపోషణ మొత్తమును డిపాజిటు చేయుట. 13. ఈ అధ్యాయము క్రింద ఉత్తర్వు చేయబడినపుడు, అట్టి ఉత్తర్వు ప్రకారం ఏదేని మొత్తమును చెల్లించవలసిన సంతానము లేదా బంధువు, ట్రిబ్యునలుచే ప్రకటించబడిన ఉత్తర్వు తేదీ నుండి ముప్ఫై దినముల లోపల, ఉత్తర్వు చేయబడిన మొత్తము పైకమును ట్రిబ్యునలు ఆదేశించునట్టి రీతిలో డిపాజిటు చేయవలెను.