ఈ పుటను అచ్చుదిద్దలేదు

కు బేరరావు తనలో 91 నోటు తెమ్మని ఆ భయం. ఒక్కొక్కప్పుడు పెద్ద నోట్లున్నాయిగాని, చిల్లరి లేదంటాను. ఒక వేళ, నాకంటే మొండిఘటం అవతల పోగై 'అయ్యా! నే చిల్లరి తెచ్చాను, తెండి నోటు,' అంటాడు. అప్పుడు నేను మావాళ్ళని అడుగు తాను. వెంటనే మా వాళ్లు నే నిదివరకే చెప్పి పెట్టిన ప్రకారం “ పెట్టి తాళం చెవి పొద్దుణ్ణించీ కనపట్టం లేదు” అని నసుగుతూ సమాధానం చెబు తారు. దాంతోటి వాడు పోతాడు. వాడు పోయేటప్పుడు గాని ఏమన్నా పొగరు కనపరిచాడా, వాణ్ణి మార్చేసి వాడిక మరోడి దగ్గర పెడతాను. అలాగ ఇంట్లోంచి బయటికి వెళ్ళే ప్రతీకానీ దమ్మిడీ ఆలీ దగ్గర్నించి నేను చచ్చినంత శ్రద్ధ తీసుగుంటాను. ఘరానా కొట్ల మీదికీ పాపుల మీదికి నేను నెళ్ళనే వెళ్ళను. నేను రావడం వాలకం ఎల్లా పసికడ తారో కట్టి, సరుకులన్నీ దాచేసుగుని, నేను ఏది అడిగితే అదల్లా లేదంటారు చచ్చినాళ్ళు! పైగా, అట్లాంటి చోట్ల నాప్రజ్ఞ లొగ సానై నేను బోల్తా కొట్టచ్చు. ఇంటి దగ్గరికి అమ్మ తెచ్చే వాళ్ళు విశేషం చదువుకుని నా అంత పరిక్ష ప్యాసై ఉండరు గనక, వాళ్ళని లాలించడం, పొగడ్డం, పడగొట్టడం నాకు తెగ సరదా. బేరాలు చెయ్యడం నా అభిమాన విషయం. గుంటాను, తెగేసి, నా కేమన్నా భయమా ! ఆ సందర్భం గురించే రాలుగాయి కుంక లంతా కలిసి కమిటీలుగా ఏర్పడి, "కుబేర రావు” అనే బిరుదు చెయించి నా కిచ్చాం అని తెలియపరిచారు - దాన్తో నేను ఏడుస్తూ కూచుంటాననే ధైర్యం కొద్దీ! వాళ్ళ, నేనే ఒప్పు