ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

తనలో

వ్యవసాయంలో కోస్తాను, కుప్పేస్తాను, నూరుస్తాను, వేరుస్తాను. అల్లా ఊహూ తెగనరుక్కు పోవడమేకాని, ఆ మాటలు ఎవరెవరి పంటా, ఎంతెంతవరకూ అంటూ కూచోను; కూచోవలిసిన అవసరం లేదు. మాటల మీద స్వంతహక్కు ఏ ఒక బ్రహ్మరుద్రుడికీ లేదు. నేను మాటలతో నా కొంప కట్టుగునే టప్పుడు ఆ దినుసు కనపడ్డ ప్రతీచోట్నించీ, ప్రతీకొంపదీ అయినకాడికి కట్టలుకట్టి వేసేసుగు రావడమేకాని, అల్లా చెయ్యడంవల్ల ఎవడి కొంప కూల్తోందో, ఎవడి సాతు పెల్లగిలుతోందో, ఎవడి జీవం సన్నగిలుతోందో అంటూ చికాకుపడను. ఒక్క మానవజాతికి మాత్రమే భగవంతుడు కటాక్షించిన మాటలే వృత్తిగా పెట్టుగుని నేను మిక్కిలి తమా షాగా శ్రమపడి, రచనలు, కల్పనలూ, అమరకాలూ, ఎగు మతులూ, త్రుటికాలంలో చేసుకుంటూ, అవి నా పేరు మీదుగా మానవజాతికి దాఖలు చేసుగుంటూ, అందులో ఉండే సృష్టి ప్రజా, ప్రకటన సామర్థ్యమూ నా వేగాని అన్యుడివి కావని జనం తమ పనితొందరలో గమనించక పోతారేమో అనే భయంచొప్పున నేనే ఢంకా మీద కొట్టి చెప్పుగుంటూ, మన కెందుకని చెప్పేసి చిక్కు సమయాల్లో ఊరుకుంటూ ఉంటూంటే, నా పనికి నన్ను అధమం ఊరేగించడం లేదు ఏమి లేదు సరిగదా, నే నేదో అపహరణం చేసినట్టు కొందరు కొందరు నా యెదటే ఎందుకు ఈర్ష్య కక్కుతున్నారో నాకు ఆశ్చర్యం వేస్తుంది! నా మాటలు నేను నా స్వంత