విశ్వామిత్రరావు - తనలో 20 11
చెయ్యడంలో కొన్ని కొన్ని దూడలు వెయ్యడంవల్ల పట్టుబడి పోతారుకాని, నేను ఆరితేరినవాణ్ణిగనక నాకు లెబ్బలేదు. లేకపోతే, పాతరచన పట్టుకుని దాని రూపం మార్చేసి కొత్త స్వరూపం నా స్వంతం అంటాను. పద్యాన్ని గద్యంకింద ముక్కలుకొడతాను, గద్యాన్ని గుండకొట్టి పద్యం చేస్తాను. పురాణ ప్రబంధశతకాలలోంచి ఏమి ఎప్పుడు ఎంతవరకు ఏరకం ఏరూపంలో కావలిస్తే అట్లా పుచ్చుగుని అది నాదే అని, నన్నొచ్చి అడిగేటంత నీచపుపని పండితులు చెయ్యరు గనక పామరుల్ని హడలగొడతాను. నాటకాలూ వాట్ల వంటివీ అన్నీ సంభాషణ మాటలేగనక అవి వీధులోనూ, బజార్లోనూ పడి దొర్లే జాతిగనక మెడమీద తలఉండి, నాడి సరిగ్గా ఉన్న ప్రతీవాడూ అవి పోగు చెయ్యడానికి అర్హుడే గనక, వాళ్ళల్లో నేను మొదటివా ఇంటాను. నవలని పట్టు గుని కథచేసి, కథని పట్టు గుని నవలగా విస్తరించి స్వంతం చేసుకోడానికి నేను వ్యవహరిస్తాను గనక నాకు ఢక్కాలేదు. కథలన్నీ ముసలమ్మలచేత ఉత్పత్తి చెయ్యబడేవిగనక నేనూ మా ముసలమ్మచేత వడికించాను, అది నాదే అనచ్చు, కాని ఆగమ, లోప, ఆ దేశ, సంగ్రహణ, విస్తరణాలు పరివర్తనకి మూల సాధనాలు గనక, యాథార్థ్యం దాచడానికి వాటిని ఉచితంగా, అతి కాకుండా వాడాలి. ఒక్కొక్కప్పుడు నేనుమరీతొందరలో మరీ జోరుగా రచించేటప్పుడు, ఎవడిదో నీబోటి పాత చచ్చినాడి చవటపద్యం ఎక్కించేసుకోవలిసిన అవసరం నా కొస్తుంది. అంతతొందరలోనూకూడా కాస్త