పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/75

ఈ పుట ఆమోదించబడ్డది

72

6న మౌల్వీ తన బలగాలతో అలహాబాద్‌ పట్టణంలో ప్రవేశించి కంపెనీ అధికారులను తరిమికొట్టినగరాన్నిస్వాధీనం చేసుకున్నారు. డిల్లీ చక్రవర్తి బహదూర్‌ షా జఫర్‌ ప్రతినిథిగా ప్రకటించుకుని పట్టణంలోని కౌసర్‌బాగ్ కేంద్రంగా చేసుకుని పాలనా వ్యవహారాలను సాగించారు. మౌల్వీ పరిపాలనా దక్షకతను, అన్ని సాంఘిక జనసముదాయాల పట్ల ఆయన చూపుతున్న సమానతను గమనించి గ్రామాలకు గ్రామాలు తరలి వచ్చి ఆయనకు మద్దతు తెలిపాయి. ప్రజలు, స్వదేశీ సైనికులు, శిష్యవర్గం, ప్రముఖులు ఆయన వెంట నడిచారు. తద్వారా అపార ప్రజాబలం సంపాదించుకున్నమౌల్వీ తన పరగణాలో ఆంగ్ల అధికారుల ఛాయలు కూడా లేకుండా చేసి స్వదేశీయుల పాలనను పున:స్థాపితం గావించారు.

ఈ సందర్భంగా ప్రజలలో, స్వదేశీ సైనికులలో దేశభక్తిని పెంపొందించటమే కాకుండా ఆంగ్లేయల దుర్నీతిని ఎండగడ్తూ హిందూ-ముస్లి-శిక్కుల మధ్య ఐక్యతను కాంక్షిస్తూ, పయాం-యే-అమల్‌ శీర్షికతో ఆయన రాసిన ప్రబోధగీతం మరో స్వాతంత్య్ర

సమరయోధులు అజీముల్లా ఖాన్‌ సంపాదకత్వంలోని పయామే ఆజాది అను ఉర్దూ

పత్రికలో ప్రచురితమై ప్రజలను, పోరాట యోధులను ఉత్తేజితుల్ని చేసింది.

అలహాబాద్‌ నగరాన్నిస్వాధీనం చేసుకున్నాబ్రిటిషర్ల ఆధీనంలో మిగిలిపోయిన అలహాబాద్‌ కోటను పట్టుకోడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అంతలో అలహాబాద్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అపార సైనిక బలగాలతో సైనికాధికారి జనరల్‌ నీల్‌ (General Neill) జూన్‌ 11న దాడి జరిపాడు. ఈ పోరాటంలో స్వయంగా పాల్గొన్న మౌల్వీ ప్రతికూల పరిస్థితు లలో జూన్‌ 17న యుద్దబూమి నుండి తప్పుకున్నారు. కంపెనీ బలగాలను సవాల్‌ చేసి మట్టికరిపించి,స్వతంత్ర పాలనకు అంకురార్పణ చేసిన ఆయనను ఏమాత్రం విడిచి పెట్టరాదని నిర్ణయించిన కంపెనీ పాలకులు మౌల్వీని పట్టిస్తే ఐదు వేల రూపాయలు ముట్టచెబుతామని నజరానా ప్రకటించారు.

ఆ ప్రకటనతో అప్రమతులైన మౌల్వీబ్రిటిష్‌ అధికారుల కళ్ళుగప్పి మారు వేషాలతో సంచరిస్తూ మళ్ళీపోరుకు శక్తియుక్తులను సమీకరించటం ఆరంభించారు. ఆ సమయంలో ఒక నమ్మక ద్రోహి అందించిన సమాచారం మూలంగా మౌల్వీ కంపెనీ సైన్యాల బారిన పడ్డారు. ఆ సందర్భంగా జరిగిన విచారణలో మాతృదేశాన్ని ఆంగ్లేయుల పెత్తనం నుండి విముక్తం చేసేందుకు మాత్రమే తాను ఆయుధం అందుకున్నానని చాలా స్పష్టంగా ఆయన ప్రకటించారు. చివరకు ఆయన మీద రాజద్రోహ నేరం మోపి, ఆజన్మాంత ద్వీపాంతరవాస శిక్ష విధించి, అండమాన్‌ దీవులకు పంపగా 1892 మే 17న మౌల్వీ లియాఖత్‌ అలీ తనువు చాలించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌