పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/58

ఈ పుట ఆమోదించబడ్డది

55

19. దూదు మియా

(1819- 1860)

బెంగాల్‌లో ప్లాసీ-బక్సర్‌ యుద్ధాల తరువాత తమ పునాదులను పటిష్టం చేసు కున్న ఆంగ్లేయులు చలాయిస్తున్న ఆధిపత్యం, అంతులేని దోపిడీని సహించలేక తిరగబడిన ప్రజలకు సమర్థవంతమైన నాయకత్వం అందించి ప్రజా పోరాటాలు సాగించిన యోధులలో దూదుమియా లేక దాదుమియా ఒకరు.

బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాల చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నఫరాజీ ఉద్యమానికి అంకురార్పణ చేసిన హజీ షరియతుల్లా ఇంట 1819లో దూదు మియాగా పేర్గాంచిన ముహమ్మద్‌ మోసిన్‌ జన్మించారు. తండ్రిని మించిన తనయునిగా ఖ్యాతి గాంచిన ఆయన బ్రిటిషర్లు, వారి తొత్తులకు వ్యతిరేకంగా ఫరాజీలను పోరుబాటన నడిపించి, భారత స్వాతంత్య్రసంగ్రామ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టారు. చిన్ననాటనే తండ్రిబాటను అందిపుచ్చుకున్న దూదు మియా ధార్మిక చింతనతో పాటుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల పట్ల అవగాహన సంతరించుకుని 1839లో తండ్రి స్థానంలో ఫరాజీ ఉద్యమం నేతగా బాధ్యతలు చేపట్టారు. అపూర్వ కార్యదాక్షత, చక్కని ఉద్యమ నిర్మాణ కౌశల్యం ప్రదర్శిస్తూ, దూదు మియా పరుగులు పెడుతున్న ఫరాజీ ఉద్యమాన్నితీర్చిదిద్ది సకారాత్మక మలుపుతిప్పారు. ప్రజాకంటకులైన ఆంగ్లేయాధికారులకు,

చిరస్మ రణీయులు