పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/194

ఈ పుట ఆమోదించబడ్డది

191

87. బేగం మజిదా బానో

(1919- 1974)

బ్రిటిష్‌ వలసపాలకులను తరిమివేతకు పోరాటం సాగిస్తున్న ప్రజలను,ద్విజాతి సిద్ధ్దాంతం ఆసరాతో చీల్చి, మతోన్మాదాన్ని రెచ్చగొట్టిపబ్బం గడుపుకోవాలన్న స్వార్థ్ధపర శక్తులకు, వ్యక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించారు. భారతదశంలోని ముస్లింలందరికి తనకు తానుగా ప్రతినిధిగా ప్రకటించుకున్న అఖిల భారత ముస్లిం లీగ్ నాయకుల వేర్పాటువాద చర్యలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, మతం పేరుతో అధికారాన్ని చేపట్టాలనుకుంటున్నశక్తుల ఎత్తులను చిత్తుచేయడానికి ఎంతో సాహసంతో బరిలోకి దిగిన సాహసి బేగం మజీదా బానో.

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, నాటి నిజాం సంస్థానం రాజధాని హైదారాబాదు నగరంలో బేగం మజీదా బానో 1919లో జన్మించారు. ఆమె తండ్రి ముసపా అహమ్మద్‌. ఆయన నిజాం సంస్థానంలో అధికారి. పదవ తరగతి చదువుతున్నప్పుడు బేగం వివాహం ఉత్తర ప్రదశ్‌కు చెందిన న్యాయవాది మహమ్మద్‌ సిద్దీఖీతో జరిగింది. వివాహం తరువాత భర్తతోపాటుగా ఆమె ఉత్తర ప్రదేశ్‌ వెళ్ళిపోయారు.

ఆమె అత్తింవారింలో కూడాజాతీయోద్యమకారులున్నారు. భర్తతో ఆయన కుటుంబ సబ్యులతో అత్యంత సన్నిత సంబంధాలు గల ప్రముఖ జాతీయోద్యమ నాయకులు రఫీ అహమ్మద్‌ కిద్వాయ్‌ ప్రభావంతో ఆమె కూడాభర్తతోపాటుగా జాతీయోద్యమంలో

చిరస్మరణీయులు