పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/185

ఈ పుట ఆమోదించబడ్డది

182

1934లో 'టూర్‌' అను భావగీతం ద్వారా తనలోని కవితా తృష్ణకు అక్షర రూపం కల్పించిన ఆయన బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి, ఫాసిజానికి వ్యతిరేకంగా ఉర్దూ కవిత్వం సృష్టించటం ఆరంభించారు. ఆ క్రమంలో 1936లో ఆయనకు కమ్యూనిస్టు గ్రూపులతో సంబంధాలు ఏర్పడ్డాయి. 1941లో కమ్యూనిస్టు పార్టీ హైదారాబాదు నగర శాఖను ప్రారంభించడంలో ఆయన ప్రదాన పాత్ర వహించారు.ఆ తరు వాత అటు జాతీయోద్యమం ఇటు కమ్యూనిస్టు ఉద్యమంలో పూర్తికాలం పనిచేసేందుకు మఖ్దూం మొహిద్దీన్‌ అధ్యాపక ఉద్యోగానికి రాజీనామా చేశారు.

1942లో 'క్విట్ ఇండియా ఉద్యమం' ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు ఆయన శిక్షను అనుభవిచారు. ఈ సందర్భంగా ఆయనకు జైలులో జాతీయోద్యమకారులు, నిజాం స్టట్ కాంగ్రెస్‌ నేతలు స్వామీ రామానంద తీర, అచ్యుతరావు దేశ్‌పాండే లాంటి ప్రముఖుల పరిచయం లభించింది.

1946లో నిజాం సంస్థానంలోని పారిశ్రామిక వాడలలోని కార్మికులకు తగిన సంక్షేమ చట్టాలు లేక పలు ఇక్కట్లు పడడాన్నిగమనించిన మఖ్దూం కార్మికోద్యమ నిర్మాణం కోసం నడుంకట్టారు. అప్పటి నుండి ఆరంభమైన ఆయన కార్మికోద్యమనేత పాత్ర చరమాంకం వరకు సాగి ఉన్నత శిఖరాలను అందుకుంది. ఈ క్రమంలో ఆయన ఇటు నిజాం ప్రభుత్వం నుండి అటు ఆంగ్లప్రభుత్వం నుండి శిక్షలు-ఆంక్షలను చవి చూశారు. అయినా వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా ముందుకు సాగిన మఖ్దూం నైజాం విలీనోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వరాజ్యం లభించాక జరిగిన ఎన్నికలలో విజయుడై ప్రజాప్రతినిధిగా, శాసనమండలి సభ్యునిగా ప్రజలకు సేవలు అందించారు.

కవిగా మఖ్దూం మొహియుద్దీన్‌ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన పలు కవితల రాశారు. ఆయన రాసిన కవితలలో తూర్పు, తెలంగాణా, సిజ్జా, జవాని, యాద్‌ హై, మైం, షాయర్‌,ఇంతెజార్‌, ముస్తబ్బిల్‌, దోకతయో, ఇన్తిసాబ్‌, జంగ్, మశరిక్‌, ధువ్రా, ఇక్‌బాల్‌, అంథేరా, జంగ్ హై జంగ్ ఆజాదీకి, సితారే, చార్‌గల్‌, అజ్‌కిరాత్‌ నజా, చుప్‌సారహో, సన్నాటా, అప్నాషహర్‌ ప్రముఖమైనవి. ఈ మేరకు మఖ్దూం రాసిన గీతాలు-గజళ్ళలో కొన్ని హిందీ చలన చిత్రాలలో కూడా చోటుచేసుకున్నాయి.

ఈ విధంగా ప్రజా జీవనరంగంలో జాతీయోద్యమకారునిగా, కవిగా, కార్మికోద్యమ నిర్మాతగా, ప్రజాప్రతినిధిగా, ప్రజా సేవకునిగా బహుముఖ పాత్రలను నిర్వహించి, ప్రజల హృదయాల మీద తనదైన చెరగని ముద్రను వేసిన మఖ్దూం మొహియుద్దీన్‌ 1969 ఆగస్టు 25న కన్నుమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌