పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/184

ఈ పుట ఆమోదించబడ్డది

181

82. మఖ్దూం మొహిద్దీన్‌

(1908-1969)

జాతీయోద్యమంలో కవులు-కళాకారులు అటు జాతీయోద్యమకారులుగా, ఇటు కవులు-రచయితలుగా ద్విపాత్రాభినయం చేశారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులు, ఆ శక్తుల మిత్రుల మీద అక్షరాగ్నులు కురిపించిన కవులలో మఖ్దూం మోహిద్దీన్‌ ఒకరు.

1908 ఫిబ్రవరి 4న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మెదక్‌ జిల్లా ఆందోల్‌ గ్రామంలో ఆయన జన్మించారు. చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన ఆయన పినతండ్రి బషీరుద్దీన్‌ ఇంట పెరిగారు. ఆ ఇంటఇటు జాతీయోద్యమం, అటు సామ్యవాద వ్యవస్థకు సంబంధించిన ప్రాధమిక సమాచారం మఖ్దూంకు పరిచయమయ్యాయి.

1929లో చదువుల కోసం గ్రామం విడిచి హైదారాబాద్‌ చేరుకున్న ఆయన చాల పేదరికాన్ని అనుభవించారు.1937లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో యం.ఏ చేసి, ఆ తరువాత ఉర్దూ నాటకం మీద పరిశోధనా పత్రం సమర్పించి డాక్టర్ పొందిన ఆయన 1929లో నగరంలోని చిటీకాలేజీలో అధ్యాపకునిగా స్థిరపడ్డారు.

ఆ రోజుల్లో 'నిగార్‌' పత్రికలో నియాజ్‌ ఫతేపూర్‌ రాసే వ్యాసాలు, కవితలు హేతు దృష్టితో యువకుల్లో ఆలోచనలు రేకెత్తించేవి. నియాజ్‌ రచనలు,బ్రిటిష్‌ సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా, సామ్యవాద వ్యవస్థ, ప్రజాతంత్ర లౌకిక విధానాలకు గురించి జవహర్‌లాల్‌ నెహ్రూ˙ చేస్తున్న ప్రసంగాలు మఖ్దూంను బాగా ఆకట్టుకున్నాయి.

చిరస్మరణీయులు