పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/16

ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టర్‌ జి.సాంబశివారెడ్డి M.A., M.Ed., Ph.D

చరిత్రశాఖాధ్యక్షులు, SBVR కళాశాల, బద్వేల్‌.

ఆప్తవాక్యం

2004లో విజయవాడ లయోలా కళాశాలలో ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సదస్సు జరిగినప్పుడు మిత్రులు మహబూబ్‌ బాషా ద్వారా సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ గారు పరిచయమయ్యారు. ఆ తర్వాత నాగార్జునసాగర్‌, కడప తదితర చోట్ల జరిగిన చరిత్ర సదస్సులలో నశీర్‌ని కలవడం జరుగుతున్నది. మిత్రులు నశీర్‌ రచనా కార్యకలాపాలను గూర్చి బాషా చెబుతున్నప్పుడు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యాను. క్రమక్రమంగా ఆయన గూర్చి మరిన్ని వివరాలు తెలియడమూ, ప్రత్యక్షంగా ఆయనను కలవడమూ, ఆయనతో ఆలోచనలు పంచుకోవడమూ జరిగి అభిమానం పెరిగి, ఆప్తంగా మారింది. మంచివాడితో స్నేహం సాయంకాలపు నీడలాగా పెరుగుతుందని ఎవరో కవివర్యులు అన్నట్టుగా నశీర్‌ అహమ్మద్‌తో స్నేహం దినదిన ప్రవర్థమానమవుతూ వస్తోంది.

ఒక 'జాతి'గా 'భారతజాతి'ని రూపొందించడానికి చారిత్రక జ్ఞానం అనివార్యం. భారత జాతీయ అస్తిత్వానికి చరిత్ర జ్ఞానం ఆయువుపట్టు అన్నా అతిశయోక్తికాదు. భారత జాతి ఏ విధంగా రూపొందిందన్న విషయం తెలుసుకోవడం భారతీయులందరి కర్తవ్యం. 'సుసంప్నమైన బహువిధమైన మన దేశ వారసత్వ సంపద' పట్ల గర్వించాలంటే ఏయే సాంఫిుక సముదాయాలు, ఏయే విధంగా యిక్కడి చరిత్ర, సంస్కతులను సుసంపన్నం చేశాయో మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకున్నప్పుడు వివిధాసాంఫిుక సముదాయాలకు ఒకరి పట్ల ఒకరికి గౌరవం, సహానుభూతి యేర్పడతాయి. ఇలాంటిభావాలే జాతీయ విలువల్ని రూపొందిస్తాయి. ఇలాంటి రచనలు మనకెంతగానో అవసరం.

కానీ దురదృష్టవశాత్తు ఈ పని సవ్యంగా సాగడం లేదు. భారత దేశ నిర్మాణంలో అవిభాజ్య భాగాలైపోయిన ముస్లింల చరిత్ర విస్మరణకు గురైపోతుండడం దీనికొక ఉదాహరణగా చూడవచ్చు. ఋణాత్మక భావనలో ముస్లింలు చరిత్ర భారాన్నిమోయాల్సి రావడం మిక్కిలి శోచనీయం. 'సెక్యులర్‌' భారతంలో ముస్లింలు దినదినమూ అంచులకు నెట్టివేయబడుతున్న వైనం మనందరికీ తెలిసిందే! మనకు సాధారణంగా తెలిసిన విషయాలనే