పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/141

ఈ పుట ఆమోదించబడ్డది

138

ఆర్యన్‌ విశ్వవిద్యాలయం Professor in Hindu-Muslim Culture అవార్డును, Academia International America ఆయనకు Dorctor of Literature ను ప్రకటించి గౌరవించాయి.

మహాత్మాగాంధీ స్పూరితో 1916లో భారత జాతీయ కాంగ్రెస్‌ సబ్యత్వం స్వీకరించిన ఆయన జాతీయోద్యమంలో భాగంగా జాతీయ కాంగ్రెస్‌ పిలుపు మేరకు సాగిన ఉద్యమ కార్యక్రమాలన్నిటిలో ప్రముఖంగా పాల్గొన్నారు. ఆధ్యాత్మిక-సాహిత్య రంగాలలో నిమగ్నమైన ఉమర్‌ అలీషా, తన చుట్టూ గిరి గీసుకుని ఏనాడు కూర్చోలేదు. సమకాలీన రాజకీయ పరిణామాలకు ఆయన కవిగా, పౌరునిగా, నాయకునిగా స్పందించారు.

1923-1924లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ సబలో అఖిల భారత ఖిలాఫత్‌ కమిటి ప్రధాన కార్యదర్శిగా, ముస్లిం లీగ్ మద్రాసు శాఖకు ఉపాధ్యాక్షునిగా, ప్రధాన కార్యదార్శిగా నాయకత్వం వహించారు. ఖిలాఫత్‌ వాలీంర్‌ కోర్‌ కు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంచి వాగ్ధాటిగల ఆయన తన ప్రసంగాలతో ప్రజలను జాతీయోద్యమం దిశగా కార్యోన్ముఖులను చేస్తూ పలు ప్రాంతాలు పర్యటించారు.

జాతీయోద్యమ కాలం నాటి ప్రజా పోరాటాలకు స్పందిస్తూ, దేశభక్తి ప్రపూరితమైన పద్యాలను రాశారు. ఉమర్‌ అలీషా వ్యక్తం చేసిన రాజకీయ భావాలను గమనించిన గాంధీజీ 'ఉదాత్తమైన రాజకీయ భావాల వ్యక్తి' గా ఆయనను ప్రశంసించారు. 1928 తరువాత జాతీయోద్యమ కార్యక్రమాలకు కొంచెం దూరమైన ఆయన 1930 తరువాత భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. 1935లో అఖిల భారత శాసనసభకు ఎన్నికలు రాగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేసి విజయం సాధించాక ముస్లిం లీగ్ నేత మహ్మదాలి జిన్నా నాయకత్వాన్ని అంగీకరిస్తూ ముస్లిం లీగ్ లో చేరారు.

భారత శాసనసభలో ఆయన కన్నుమూసే వరకు అనగా దాశాబ్దం పాటు ప్రజా ప్రతినిధిగా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. చట్టాల రూపకల్పన జరుగుతున్నప్పుడు సంస్కతం, పర్షియన్‌, అరబిక్‌, ఉర్దూ తదితర భాషలలో మంచి పండితుడుగా ఖ్యాతిగాంచిన ఆయన సలహాలను సెంట్రల్‌ అసెంబ్లీ గౌరవంగా స్వీకరించింది. ప్రజాప్రయాజనాలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యతనిస్తూ నిజాయితీపరు డైన మంచి ప్రజాప్రతినిధిగా డాక్టర్‌ ఉమర్‌ అలీషా పేరుగడించారు.

గుంటూరు జిల్లా తెనాలిలో ముసింలీగ్ రాష్ట్రశాఖ ఆహ్వానం మేరకు పాల్గొన్న ఆయన చివరి రాజకీయ ప్రసంగం చేసి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వెళ్ళారు. నరసాపురంలో మౌల్వీ ఉమర్‌ అలీషా 1945 జనవరి 23న ఆకస్మికంగా తనువు చాలించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌