పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/124

ఈ పుట ఆమోదించబడ్డది

121

52. బద్రుల్‌ హసన్‌

(1898- 1937)

శతృవు ఎంతి బలవంతుడైనా ఏమాత్రం లెక్కచేయకుండా మాతృభూమి విముక్తి కోసం అహింసా మార్గాన సాగిన యోధులలో బద్రుల్‌ హసన్‌ ముఖ్యులు.

ఆనాటినిజాం రాజధాని హెదారాబాద్‌లోని సంపన్న కులీన కుటుంబంలో 1898లో ఆయన జన్మించారు. ఆయన తల్లి ఫక్రుల్‌ హాజియా హసన్‌ స్వాతంత్య్ర సమరయాధు రాలు. జాతీయోద్యమానికి ఆమె సర్వస్వం ధారబోసిన ఆమె బిడ్డలంతా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఆ తల్లి వారసుడుగా బద్రుల్‌ హసన్‌ జాతీయోద్యమకారుడయ్యారు. జర్నలిస్టుగా గాంధీజీ వద్ద శిష్యరికం చేయాలన్నసంకల్పంతో హెదారాబాద్‌ వదలిపెట్టి సబర్మతి ఆశ్రమం చేరు కున్న బద్రుల్‌ హసన్‌ గాంధీజీ సంపాదకత్వంలో ప్రచురితమవుతున్న 'యంగ్ ఇండియా' పత్రికలో మధ్యపానం నిషేధావశ్యకతను విశ్లేషిస్తూ పలు వ్యాసాలు రాశారు. ఆ తరువాత అలహాబాద్‌ నుండి వెలువడుతున్న'ఇండిపెండెంట్' అను అంగ్ల పత్రికకు విలేకరిగా చాలా కాలం బాధ్యతలను నిర్వహించారు. ఆ సమయంలో బద్రుల్‌ హసన్‌లోని జాతీయవాది తనదైన రీతిలో స్పందించాడు.

ఆ క్రమంలో జాతిని చైతన్యపరిచే పలు రచనలు చేశారు. బ్రిటిష్‌ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించగలగడమే కష్టతరంగా ఉండగా బద్రుల్‌ హసన్‌ 1920లో తిలక్‌ స్వరాజ్య నిధిని సమకూర్చేందుకు నడుంకట్టారు. ఈ మేరకు 23 వేల రూపాయలను సేకరించి

చిరస్మరణీయులు