పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/123

ఈ పుట ఆమోదించబడ్డది

120

ఆయన రౌలత్‌ బిల్లు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనటం ద్వారా గాంధీజీèకి బాగాసన్నిహితులు అయ్యారు. 1920లో వైశ్రాయిని కలసిన ఖిలాఫత్‌ ప్రతినిధి వర్గానికి అన్సారి నాయకత్వం వహించారు. గాంధీజీ పిలుపు మేరకు సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించారు. ఆనాడు ఆయనలో కలిగిన ఆలోచనల ప్రతి రూపంగా1920 అక్టోబర్‌ 29న ఆరంభమైన జాతీయ జామియా కళాశాలకు హకీమ్‌ అజ్మల్‌ఖాన్‌ తరువాత ఛాన్సెలర్‌గా బాధ్య తలను చేపట్టిన అన్సారి, జామియా సుస్థిరత, అభివృద్ది కోసం జీవిత చరమాంకం వరకు కృషి చేశారు.

అన్సారి హిందూ-ముస్లిల ఐక్యతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. 1921నాటి ముస్లిం లీగ్ సమావేశంలో మాట్లాడుతూ హిందువుల మనోభావాలను గౌరవిస్తూ, బక్రీద్‌ పండుగ రోజున గోవులకు బదులుగా ఇతర జంతువులను ఖుర్బాని ఇవ్వవలసిందిగా కోరుతూ తీర్మానించాలన్నారు. మత విద్వేషాలకు దూరంగా సామరస్య వాతావరణం ఏర్పాటుకు నిరంతరం కృషి సల్పారు. జాతీయ స్థాయిలో మత కలహాలను నివారించేందుకు లాలా లజపతిరాయ్‌తో కలసి The Indian National Pact ను రూపొందించారు. హిందూ -ముస్లింల మధ్య ఐక్యతా ప్రయ త్నాలలో భాగంగా 1924లో Unity Confernce, 1927 అక్టోబరు 27న మరో ఐక్యతా సదస్సును నిర్వహించారు. మతతత్వభావాలు గల నేతల వలన ఆయన ప్రయత్నాలకు సత్పలితాలు లభించకపోవటంతో మతాన్నిరాజకీయాలతో జత చేయరాదని పలుమార్లు ఆయన చాలా విస్పష్టంగా ప్రకటించారు.

ప్రజలలో జాతీయ భావనలను ప్రోదిచేసేందుకు అవిరళ కృషి చేసన అన్సారి 1929 జూలై 27-28న జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలోని జాతీయభావాలు గల ముస్లింలను ఏకతాటిపై నడిపేందుకు అఖిల భారత జాతీయ ముస్లిం పార్టీ ఏర్పాటు చేసి దానికోశాధికారిగా ఆర్థిక బాధ్యతలను నిర్వహించారు. గాంధీజీ ఆహ్వానం మేరకు 1927లోజాతీయ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టిన ఆయన తన సంపదలోని అత్యధిక భాగాన్ని పార్టీ కార్యకలాపాల కోసం, పార్టీ కార్యకర్తల ఎన్నికల కోసం వినియోగించి చివరకు ఆర్థికంగా రుణగ్రస్తుడయ్యారు.

అ తరువాత వచ్చిన రాజకీయబేధాభిప్రాయాల వలన జాతీయ కాంగ్రెస్‌ పార్టీలోని పదావులన్నిటిని వదులుకున్న అన్సారి 1935లో ప్రజాజీవితం నుండి పూర్తిగా నిష్క్రమిసున్నట్టుగా ప్రకటిం చారు. ఆ తరువాత శేషజీవితాన్ని రచనల కోసం, జామియా మిలియా కళాశాల అభివృద్ధి కోసం వినియోగిస్తూ నిరంతరం శ్రమించిన డాక్టర్‌ ముక్తార్‌ అహమ్మద్‌ అన్సారి 1936 మే 10న చివరిశ్వాస వదిలారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌