పుట:చిత్రభారతము (చరికొండ ధర్మన).pdf/219

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ష్ఠిరుం డూరకున్న పదంపడి దుర్యోధనుండు శరణాగతుం
డైన యీచతుర్ధనుం గాచెదనని మావిజయుండు పలికిన
నేము వీరలతోడం గూడియున్నవారము కృష్ణుం డీ
చతుర్ధనజననాయకుఁ జంపెదనన్న ప్రతిన మానుట [1]మేలు
లేదా యటమీఁదఁ దానే యెఱుంగునని యివి యాది
గాఁగల యనుచితవచనంబులు పల్కినం దగిన యుత్తరం.
బిచ్చి యతని లక్ష్యంబు సేయక భీష్మాదులతోఁ దత్తత్ప్రకా
రంబుల వెన్ను చూపి కొన్నిమాట లాడి యాప్రజ్ఞాచక్షు
నకుం జెప్పి యే నరుగుదెంచునవసరంబున ధర్మజభీమార్జు
నులు దమమాటలుగా భవత్సన్నిధానంబున విన్నపంబు
సేయుమని నాతో ననినతెఱం గెఱింగించిన నవధరింపు
మందు ధర్మజుం డిట్లనియె.

80


చ.

కమలదళాక్ష, మీజనకు గాదిలిసోదరి మాకుఁ దల్లి భా
వమునఁ దలంచినన్ నెనరువారము వెండియు దేవరందుఁ గూ
రిమి గలయట్టిభక్తులము ప్రీతిమెయిం గరుణింపు సర్వభూ
రమణులలోన నెయ్యపుమఱందికి నీచన వియ్యఁ జెల్లదే.

81


చ.

వలపరిమూపుగో దివిజవల్లభునిం దెగఁ జూచి వైరులన్
గెలువఁగఁ జేసి శుభ్రతరకీర్తి దిశావళి నించి యింతగా
మెలసితి వీవ యిప్పు డొకమేదినిఱేనికి విరోధివై
నలఁచిన నవ్వరే సురగణంబులు మానవనాథకోటులున్.

82


వ.

అనుడు భీముం డిట్లనియె.

83


చ.

వెఱపున ధర్మనందనుఁడు [2]విన్నప మాడుట గాదు బాంధవం
బరిగెడునో యటంచుఁ దెగనాడకయుండుట గాని యర్జునుం

  1. గడు నుచితంబు
  2. విన్నన చెప్పుట గాదు