పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/99

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


[1]సీ.

[2]పరిణతాసమపత్రపాతనపరనగంబునఁ బుట్టిన ప్రవాళపుంజ మనఁగ
[3]విరహార్తిఁ జల్లార్ప వేగ రమ్మని యినుఁ బ్రార్థింపఁ జనుచక్రపంక్తి యనఁగఁ
దొవలచ్చి విభుఁడు వేడ్క వరింపరా మ్రోలఁ బన్నిన కెంపుచప్పర మనంగ
నలఘుమహాతపాత్యయమునఁ బొడసూపు తరుణసౌదామనీధామ మనఁగ
విష్ణుపదసక్తుఁడును దమోద్వేషియు నగు
హంసుఁ డలవారుణీస్పృష్టి నైనదోష
మడఁప నంభోధిలోఁ దాన మాడఁ జనుచు
దరినిడిన [4]ధాతుశాటినాఁ దనరె సంధ్య.

67


చ.

[5]తమము లినవ్యపాయపటుదర్పము లై యళికైతవంబునం
దముఁ గదియంగవచ్చి యుచితధ్వనితో నిజకర్ణికాకలా
పమునకు మూఁగఁ బద్మినులు బద్ధదళాంబుజముష్టిఁ బట్టెఁ దే
జముగల మేటిబోటులు వెస న్మలినాత్ముల నాఁపఁజాలరే.

68


సీ.

సామిదష్టాబ్జకేసర మూను మది నిండి వెలిఁ బర్వు తాపాగ్నిఁ దెలుపుకరణిఁ
దమ్మిచెంగట మ్రోయుఁ దానకాత్మజుఁ డిట్టు తూలించె మము నని దూఱుకరణి
వనజాంతరాళి ముక్కున గ్రుచ్చు మైకాఁక నానఁజాలక విష మానుకరణి
మగనిఁ జీరుచు సారె మొగడదామర యెక్కు వలరాజునలుఁగుపై వ్రాలుకరణి
సరసబిసినీపలాశంబు చాటుపూని, నిలుచు నానంగసాయకానీకహతికి
లోఁగి ఫలకాంతరంబున డాఁగుకరణిఁ, గాంతు నెడఁబాసి యొక్కజక్కవవెలంది.

69


సీ.

ఘనపరంపర లివి గాఁబోలుఁ గాకున్న హంసమండలము ము న్నరుగు టెట్టు
గహనమాలిక లివి గాఁబోలుఁ గాకున్న ఋక్షసంఘము సంచరించు టెట్టు
గంధేభఘట లివి గాఁబోలుఁ గాకున్నఁ బేచకంబులు విజృంభించు టెట్టు
గరళకూటము లివి గాఁబోలుఁ గాకున్న నార్తిఁ జక్రములెల్ల [6]నఱచు టెట్టు
లనఁగ హరితనుహరతనుహరిహయమణి, హరితహరిగుణహరిహవిరశనసరణి
హరిణధరగళహయరిపుహలికవసన, హసనపటురుచిఁ దిమిరము లలముకొనియె.

70


చ.

ఘనపదకాయమానమునఁ గ్రమ్మి తలిర్చు విభావరీవినూ
తన[7]తరగోస్తనీలత యుదగ్రతమోమయధూమదోహదం
బున నలరారఁగాఁ బొడము భూరితరస్తబకంబులో యనం
దనరె నతిప్రశస్తరుచిధామములై తగు తారకావళుల్.

71
  1. ట-లో లేదు
  2. చ-పరిణతాసమపత్రపాతనగంబునఁ బుట్టినట్టి ప్రవాళపుంజ మనఁగ
  3. చ-విరహాగ్ని
  4. చ-కావిశాటి
  5. క-తమము దినవ్యపాయ
  6. ట-నడలు
  7. క-వరగోస్తనీ