పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/96

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుముదినీవిరహవర్ణనము

చ.

కలయఁగ మ్రోయుకోయిలల కాకలికాకలనాన మచ్చటన్
నిలిచి సహింపలేక బలునెవ్వగ నుల్లము తల్లడిల్లఁగా
నలసకటాక్షపాతముల నాళిజనంబులవంకఁ జూచుచున్
నిలయముఁ జేరి యేమియు [1]మనీషకు నింపమిఁ జింతఁ గుందుచున్.

48


చ.

గొడఁగెడుపావురాలరొదఁ గూడి ప్రతిధ్వను లిచ్చు కెంపుతా
గొడిగెల వ్రేలుబంగరపుగూడులఁ బల్కెడుచిల్కచాలుచే
నడరు పసిండియోనరులయంత్రపుబొమ్మలు మీటు కిన్నెరల్
గడుసుతిఁ గూడి గమ్ముమనఁగాఁ దగు సౌధముఁ జేరి ముచ్చటన్.

49


చ.

చికిలిపసిండిచాయపనీ చిత్తరువన్నియవేల్పురాచఱా
సకినెలకోళ్లతోఁ దళుకుఁజాయల గుజ్జరినేఁతపట్టెతో
రకమగు నిండుచంద్రిక ఖురాళముతో హురుమంజిపాన్పుతోఁ
జకచకలీను కప్పురపుఁ[2]జప్పరమంచమున న్వసించుచున్.

50


సీ.

పలుమాఱు రాచూలిఁ దలపోసి బెడిదంపునిట్టూర్పుగాడ్పులు నిగుడఁజేయు
నిట్టూర్పుగాడ్పుల నిగుడఁజేసి మెఱుంగుకన్నుల బాష్పము ల్గ్రమ్మఁజేయుఁ
గన్నుల బాష్పము ల్గ్రమ్మఁజేసి యనంతకంతురాజ్యం బేలఁ జింత సేయుఁ
గంతురాజ్యం బేలఁ జింత సేసి మనోంబుజమునఁ గోర్కులు కొనసాగఁజేయు
సరవిమైఁ గోరుకులు గొనసాఁగఁజేసి, కలయ వలవంతఁ నంతంతఁ గళవళించు
నిట్లు కుముదిని యానంగహేతిహలహ, లార్చి సైరింపంగా లేక యాత్మలోన.

51


ఉ.

ఆయెలమావియోవరుల నాననమాధవికాలతాగృహ
చ్ఛాయల నాసితాభ్రకృతశయ్యల నాకమనీయదేవతా
నాయకరత్నకేళిసదసంబుల నా[3]విరిచప్పరంబులం
బాయక యాతనిం గదిసి భావజకేళి సుఖంపఁగల్గునే.

52


సీ.

పాదాబ్జముల తొట్రుపాటు నేమనవచ్చుఁ బెఱిచె గొబ్బునఁ జెంతఁ జేరనీక
నినుపారఁ బాఱుకన్నీటి నేమనవచ్చు నొంచెఁ గన్నార వీక్షించనీక
వడఁకొందు మై పరవశత నేమనవచ్చుఁ గనలించెఁ బలుకులు వినఁగనీక
[4]యుజ్జగింపఁగరాని లజ్ఞ నేమనవచ్చు నడచెఁ గేలునుగేలు నంటనీక

  1. ట-యును నింపులుగామిని
  2. క-మంచముపై మహోన్నతిన్.
  3. ట-వలిచప్పరంబులన్
  4. ట-బుజ్జగింపఁగరాని