పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/94

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దలరిన నొండు రెం డగుట యద్భుత మం చొకప్రోడనెచ్చెలిం
బిలిచి యెఱుంగఁబల్కె నది మేలమునం దనుఁ గేరి నవ్వఁగన్.

34


సీ.

కల్లోలమున నన్నుఁ గదిసి యీఁదుటకు నో యుద్వేలకచజాల యోలయోల
సూటిఁగొ మ్మూని నాసాటి వ్రేయుటకు నో యుల్లోలకరనాళ యోలయోల
చేపట్టి నావెంటఁ జేరి పట్టుటకు నో యుద్దామకటిసీమ యోలయోల
దగలేక నాతోడఁ దడవు గ్రుంగుటకు నో యుజ్జృంభకుచకుంభ యోలయోల
యోయువిద యిందు రాకున్న నోలయోల
యాచెలియ యూఱకుండిన నోలయోల
యోసకియ యెందుఁబోయిన నోలయోల
యనుచు నుద్దులు గూడి పోరాడి రపుడు.

35


చ.

తరఁగల డాయుచున్ మొగడతమ్ములు గోయుచుఁ గోరి తిట్టుచుం
గరములు పట్టుచు న్మునిఁగి గ్రక్కునఁ దేలుచుఁ జాల సోలుచున్
దరులకుఁ జేరుచుం దఱుముదంటల దూఱుచు నీట ఱువ్వుచున్
దొరకొని నవ్వుచుం జెలులు తోయవిహారినితాంతతాంత లై.

36


సీ.

కరిహస్తసాదృశ్య మిరవు కొల్పుటఁ జేసి తొడ లార్ద్రభావంబుతోఁ జలింపఁ
గదళీచ్ఛదౌపమ్య మొదవఁజేయుటఁ జేసి నిలువున నుదరము ల్నిక్కుఁ జూప
హైమదర్పణసామ్య మలవరించుటఁ జేసి మెఱుఁగుఁజెక్కులు కెంపుమిసిమిఁ బూన
జలద[1]సాధర్మ్యంబు సవదరించుటఁ జేసి విప్పుగొప్పులు పయోవృష్టి నెఱప
హస్తికుంభోపమానంబు లగుటఁ జేసి
చన్నులు నఖాంకురాంకుశక్షతులఁ దెల్ప
నంబుకేళిక చాలించి యలసగతుల
సరసి వెలువడి తత్తీరధరణి నిలిచి.

37


చ.

చలువలు గట్టి తొంటి సుమసౌరభము ల్నలుచక్కిఁ గ్రమ్మఁగా
నలకలు చిక్కు [2]పుచ్చి తడియాఱిచి కొప్పులు పెట్టి పువ్వుదం
డలు గయిసేసి చాలమృగనాభి తనూతలందుఁ బూసి సొ
మ్ములు ధరియించి లత్తుకలు మోపులఁ జేర్చి వయస్య లందఱున్.

38


క.

[3]లీలావన[4]జలవిహరణ, కేళీకృత్యంబు లెట్టకేలకుఁ గలఁకం
జాలించి యుచితరచనలఁ, గూలంబున నున్నయట్టికుముదినితోడన్.

39
  1. చ-సౌందర్యంబు
  2. చ-దీర్చి
  3. ట-లో నీపద్యము లేదు.
  4. చ-విహరణబల