పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/92

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కొలఁది గాదు గా దురాశ కొమ్మ కొమ్మనంచు బోకఁ,
గలఁకఁదిట్ట దిట్ట వైతి కన్నె కన్నెఱుంగ లేక
రమణి ననకు ననకుఁ జేర రాఁగ ఱాఁగవగుచుఁ జేడి
సమరుతావి తావిదా గయాళి యాళి గొల్లలాడి
ముడిత మూలమూలఁ జాల ముడువు ముడువువగల పూలఁ
బదరనేల నే లతాంగి పట్టుపట్టు జీనువాలఁ
గనిరి లలన లలనవామ్రకలిక కలికచ ల్గడంగఁ
గనలు కలికి కలికితేల కావికావికనఁ గడంగఁ
గొఱలి వీడవీడనేల గుట్టుగుట్టు నలులమొనల
నెఱయ నింపునింపు నిచట నెలఁత నెలఁత తళుకుననలు
అతివ వట్టి వట్టివేరు నాడనాడ వైచె దేల,
సతులతరమె తరమెఱుంగ సరస సరసముడిగి బాల
సావి నిక్క నిక్క గాదు చాలుఁ జాలు [1]దఱుగువళులు
తావివండ దండమాకుఁ దమకతమకమూనువళులు
క్రోవు లేమి లేమిఁ జెలులు గుంప గుందరదనయులుకఁ
ద్రోవగట్టు గట్టుచాయ తోఁపుతోఁపుముక్కు చిలుక
నంగమలయ మలయపవన మానియానిని వడదేరెఁ
జెంగునీకు నీకు ముద్దుచిలుకఁ జిలుకఁ బిలువువారె
కింక మాను మానుషంబు గెంట గెంటసంబు లేల
కొంక కేల కేలఁబూని కొంటె కొంటె పూవుఁబాల
జగడ మొల్ల మొల్లకెట్టు చనవు చనవు బలిమితోన
నగిన మేల మేల యని పెనంగ నంగభవునియాన.

21

జలకేళీవర్ణనము

క.

అని చెలులు సుమాపచయం, బొనరించి మరందకణము లొలికెడులతలో
యనఁ దనువుల నునుజెమరులు, చినుకఁగ జలకేళిసక్తచిత్తాంబుజలై.

22


క.

[2]వరసీధుమత్తమధుకర, దరశీర్ణనవీననళినదళమిళనకళా
చిరశీలితశరశీకర, భరశీతలసరసిఁ దఱిసి ప్రమదలు తమలోన్.

23


క.

గరుదనిలాహతి సుమరజ, మిరుగడ రా నడుమ భృంగ మెసఁగె న్సరసీం
దిర దాల్చు కమ్మబంగరు, సరిపెణఁ దగు తేఁటితాళిచాడ్పున సుదతీ.

24
  1. చ-దగదువళులు, ట-దరుగుజిరులు
  2. ట-లో నీరెండుపద్యములు లేవు.