పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/91

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

చలువలు చల్లునీడల నిఙశ్రమ మార్చిన మెచ్చి చూచుతొ
య్యలి నలరించె వెండియు శుకాలపనాలఘులాలనోక్తిసం
కలవముతో మనోజ్ఞతిలకంబు మృదుచ్ఛదవీజనంబులన్
లలితమరందసేచనములన్ ఘనసారపరాగచర్చలన్.

16


ఉ.

కేకిసకొట్టి యోర్తు గిలిగించిన నొక్కవిలోలనేత్ర లీ
[1]లాకలకంఠకూజితముల న్నగఁ జెంగట నున్నపొన్న లీ
లాకలకంఠకూజితముల న్నగుచు న్సుమనోవిజృంభితా
నేకవిలాసము ల్దెలిపె నిట్టివివో పురుషానుభావముల్.

17


ఉ.

సారెకుఁ బూల కోర్తు తను సన్నలఁ దిట్ట నొకింత వుచ్చుని
ట్టూరుపుధూపము ల్శుకపికోత్కరనాదము పంబమ్రోఁతయుం
గా రతిరాజు సేర నవగంధవహాకులసిందువారశా
ఖారుచిరాక్షి లోలదళికైశికయై సివమాడెఁ గంటివే.

18


క.

అని పలికి కురులు బిగియం, బనుపఱిచి చెఱంగుఁ జెక్కి పయ్యెద లొడిగా
నొనరిచి యొండొరు మీఱన్, వనజాక్షులు కుసుమహరణవాంఛాపర లై.

19


సీ.

కొమ్మ యొకతె చేరి కొమ్మ వంచినఁ గోసె నలరుఁ గ్రొన్నన లొక్కయలరుఁబోఁడి
కలికి యొక్కతె తేఁటికళికి గొందులు దూఱ నతివర్ణ్యగతి నవ్వె నతివ యోర్తు
బాల యొక్కతె పూవుఁబాళకై గీలించి యాన నొక్కతె దాని నానయిడియె
ముదితయై మొగడలు ముదిత యొక్కతె రాల్పఁ జెలువందఁగాఁ నేఱెఁ జెలువయోర్తు
వెలఁది గురివెందపొద లొక్కవెలఁది సూప, రామణీయకనిధి యొక్కరామ పఱచె
నిట్లు వనకేళిఁ దేలుచు నిందుముఖులు, సరసవాచావిలాసంబు నెరపువేడ్క.

20


రగడ.

నెలఁత [2]నెమ్మి నెమ్మిఁ జూపె నీకు నీకుజాళినీడ
నలయక కమ్మ కమ్మఁదావి నలరు నలరుబంతులాడఁ
గలయ నీడ నీడగాదు కదలి కదలికడకు రమ్ము
వెలఁది నన్ను నన్నువిరులు వేఁడి వేఁడిమాట చిమ్ము
వనిత రాదు రా దువాళి వలదు వల దుపవనసీమ
ననలు గోర గోరఁ జీర నాన నాన వెట్టె లేమ
తమ్మికంటి కంటిఁ బొదలఁ దారుదారుచుండ ముందు
కొమ్మ మావి మావిననలు గోయకోయటంచు నిందు

  1. చ-ట-లలో నీపాదమే లేదు.
  2. చ-ట-నెమ్మి నెమ్మిఁ జూపె నీకు నాకు జాలి నిండ