పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/90

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

ఊయెల నూఁగులేమ పదమూనినమాత్ర నవీనరాగల
క్ష్మీయుతమై ముదశ్రువులు సీధుకణంబులపేరఁ జిల్కుచుం
బాయక భృంగగీతిఁ దనభాగ్యము మెచ్చుకొనం దొడంగెఁ బ
ద్మాయతనేత్ర చూడు మిది యర్హమ కాదె యశోకసంజ్ఞకున్.

9


చ.

ముదిత యొకర్తు తేంట్లు తను మూఁగిన నెచ్చెలిఁ [1]గాన కార్తయై
కుదురు మెఱుంగునిబ్బరపుగుబ్బల నొత్తినఁ దత్స్వయంగ్రహా
భ్యుదితరసానుభూతిఁ జెలువొందుచుఁ గ్రోవి తదాప్తిహేతుమ
ట్పదతతి కిచ్చు మెచ్చి నిజబంధురగంధరజోవిశేషముల్.

10


ఉ.

సామజయాన యీచిఱుతసంపఁగిసొం పరుదయ్యె నంచుఁ నా
ళీమణి యెచ్చరింప నొకలేమ ముఖాంబుజ మెత్తి చూడఁగా
నామహిజంబు పూనె సుమనోధికరాగసమృద్ధిఁ గాన నె
చ్చో మహితాళిసంగ్రహణశూన్యుల కిట్టితెఱంగు చోద్యమే.

11


చ.

రమణియొకర్తు నవ్వుచు మరందముఁ బుక్కిట నించి బోటిపై
నుమియఁగ నేగె నమ్ముగద యొండొకచెంతకుఁ బోక కేసర
ద్రుమముమఱుంగుఁ జేరె నది తోడన తన్ముఖసీధుసిక్తమై
యుమియక మానెనే యభినవోపగతప్రసవాసనంబులన్.

12


చ.

వనిత యొకర్తు కేళివనవాటి గతాగతఖిన్నయె కరం
బునుపఁగఁ దత్కరగ్రవామహోజ్జ్వలమై ముదితద్విజావళీ
ఘననినదంబు మీఱ [2]సహకారశిరోమణి వేల్చెఁ గంటె నూ
తనకిసలానలంబున సుదారమరుచ్చ్యుతనూనలాజముల్.

13


ఉ.

ఏలకితీవయుయ్యెలిపయిం జెలి [3]యూఁగ నొకర్తు లీలతో
నాలతి సేయఁగా విని ప్రియాళము పూవులవాన నించి యు
న్మీలితసీధుబాష్ప మయి మెచ్చులఁ దేలఁ దదగ్రసీమ మ
త్తాళియుఁ బాడెడు న్విను మదాంధులచెయ్వులు హాసయోగ్యముల్.

14


చ.

అసదృశధీరతాధికమదాప్తి సుదృఙ్మణు లిద్ద ఱుల్లస
ద్రసకళికోపలబ్ధికయి రాయుచుఁ బల్క సమీరణోన్నమ
[4]త్ప్రసవితశాఖికాంచలకరంబున వాద మడంచె గోఁగు వె
క్కస మగు ఱంతు సైఁతురె [5]యగంధసువర్ణసమగ్రతానిధుల్.

15
  1. ట-గూడకార్త
  2. చ-ఘనసార
  3. చ-నూఁచుచు నోర్తు
  4. ట-రీశాఖికాంచల
  5. ట-సుగంధ