పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/88

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యమి మలినత్వ మందియును హంసకసంగతిచేతఁ బాదసా
మ్యముఁ గని మించె నేరి కమలాత్ములసంగతి ఱిత్తవోవునే.

143


గీ.

అలరె వారిజనేత్రాపదాంగుళీన, ఖాళి యౌవనవనసీమ నడరునవ్య
విద్రుమలతాగ్రకోరకవితతి నాఁగ, నగ్రలాక్షారసంబు సుమాసనముగ.

144


క.

అనుమాన మేల నిజ మీ, ననఁబోఁడియె రుక్మబాహునందన యలనా
వినుకలియును గనుకలియును, మనమునఁ [1]దలపోయ నైకమత్యముఁ గాంచెన్.

145


మ.

అనుచో నాలలితాంగి నొక్కచెలి డాయ న్వచ్చి యోనెచ్చెలీ
వనవాసంతికకు న్రసాలమునకు న్వైవాహికప్రక్రమం
బొనరింపం జనుదెమ్ము వేగ యన నయ్యో దైవ మీపాటిమే
లును సైరింపఁగఁ జాలదంచు నది నాలోలత్వముం జెందుచున్.

146


క.

ఆపడఁతి యప్పు డఱవిరి, తూపులచే డీలుపడుట తోఁబుట్టునకున్
దీపింపకుండఁ జని పు, ష్పాపచయాసక్తిపై మనోంబుజ మడరన్.

147


సీ.

కైలాగు జతన మీకలువరాచలువరాల్ జీరుకుల్ వారు [2]రాజీవనయన
పాదావధాన మీపరువంపుమరువంపుఁగనిమల దాఁటుచోఁ గంబుకంఠి
[3]మేలుప్పరంబు తుమ్మెదమందరొద మందటిలు పొదల్ దూఱుచోఁ గలువకంటి
చిత్తేశు చూడు మీచిన్నారిపొన్నారికేకినీలాస్యము ల్కీరవాణి
యనుచుఁ దనప్రాణసఖులు నెయ్యంబు మీఱ, నెచ్చరికఁ దెల్స నిచ్చలో ఱిచ్చవడుచు
వెచ్చ నూర్చుచుఁ గలఁగుచు విన్న నగుచు, రామ విహరించెఁ బుష్పితారామసీమ.

148


[4]మ.

అరుణాంఘ్రిద్యుతిసారసీకృతసుధీహర్యక్ష హర్యక్షదో
ర్ధరణార్ధకృతితాభృతామరకదంబాధ్యక్ష బాధ్యక్షమా
హరణాస్తోకహృషీకచోరకనిరాసారక్ష సారక్షమా
శరకోటీపరిపాటితాంతరరిరంసల్లక్ష సల్లక్షణా.

149


క.

సంసారదూరసరణరి, రంసాధిగతప్రశంసరాగహరిణవై
తంసికసంసన్మానస, హంస మహోహంస పరమహంసవతంసా.

150


స్రగ్విణి.

ధ్యానకృత్సేవధీ దంభవిద్యావధీ, దానలక్ష్మీనిధీ దాంతహృత్సన్నిధీ
మౌనభూషావిధీ మంజుభాషానిధీ, జ్ఞానసంమోదధీ సత్త్వసామోదధీ.

151


గద్యము.

ఇది శ్రీ మద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసాది
తసరసకవితారసోదాత్త దత్తనామాత్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం
బైనచంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. చ-ట-వివరింప
  2. రాజీవగంధి
  3. ట-మేలుప్పరంబీరసాలరసాలంబు పొదరిండ్లు దూఱుచో
  4. ట-లో లేదు.