పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/87

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్గల మగుకాతరత్వమునఁ గ్రమ్మఱి కోమలకర్ణిపాళికా
కలితవతంసపద్మనవగంధవిశేషము లానఁ [1]బోవునే.

133


చ.

జగములు గెల్వఁగోరి సుమసాయకుఁ డెత్తుపసిండిటెక్కెముల్
మగువకపోలయుగ మనుమానము లే దటుగాక యున్నచో
నగణితకర్ణకుండలసమగ్రమణిప్రతిబింబదర్పణం
బగుచుఁ జెలంగునే మకరికాంకిత మై చెలువంబు సూపునే.

134


తే.

కమలసూతి సుధాకరుకందుఁ గడపి, బింబమున దీనిమోముఁ గల్పింపనయ్యె
నలికమగ్రంబు పార్శ్వము ల్తళుకుఁజెక్కు, లందు బింబాధరంబు బింబాధరంబు.

135


తే.

మంజుభాషిణి కంఠసామ్యము [2]వహింప, నబ్జ ముత్తమసుమనోర్హ మయ్యెఁ గాక
వార్ధిజాతసజాతీయవస్తు లుండ, నాదరము గాంచు టెట్లు తదాదరంబు.

136


తే.

మధుపసంగతవిటపసమాజములును, బల్లవాశ్లిష్టవల్లికాపాళికలును
సవతు వచ్చునె యీసతి సకలభువన, వర్ణనీయభుజాకల్పవల్లరులకు.

137


చ.

మును పొకకృష్ణమూర్తి ఘనము ల్గురియన్ గిరి నెత్తి గోవివ
ర్ధన మొనరింప నత్తెఱఁగు దా నది చిత్రమె యంచుఁ గొమ్మయా
రనియెడుకృష్ణమూర్తి మదనాశుగవృష్టిఁ దనర్ప గోవివ
ర్ధన మొనరించెఁ దత్కుచధరాధరయుగ్మము నుబ్బ నెత్తుచున్.

138


చ.

సరసవయో[3]విభాతమున సారసగంధిగభీరనాభి తా
మరసకుటీరము న్వెడలు మంజులరోమలతాళిరాజి బం
ధురతరపక్షవాయువుల నూత్నతదీయపరాగమాలికల్
వరుసనె రాలి రేక లగువైఖరిఁ బొల్చు వళీవిభంగముల్.

139


తే.

సుప్రతీకోత్తమాంగ మీసుదతిపిఱుఁదు, గాక యున్న రత్నాకరకాంచికాప్ర
యుక్తిఁ గనునే నితాంతవృత్తోరుసుకర, కాంతిపదపుష్కరస్ఫూర్తి గడలుకొనునె.

140


[4]తే.

కలమగర్భంబు లబలజంఘల జయింప, మళ్లఁ బడి నిక్కి కడపటఁ బొల్లువోయి
రాలిపడి కాఱికంటకాక్రాంతి విరిసెఁ, బరఁగునె వివేక మిల జడప్రకృతులకు.

141


క.

[5]తామేటివెన్నుఠీవి స, తీమణిప్రపదములు దనరె దివ్యోరుదిశా
సామజకరోపరికటీ, భూమండలి యందుమీఁదఁ బొలుపగుకతనన్.

142


చ.

ప్రమఢపదంబులం దొరయఁ బంకజముల్ వనమధ్యసీమఁ జ
క్రములకు నింపుగాఁ దపముఁ గాంచుతఱి న్మధుపాళితోడఁ బా

  1. చ-నోపునే
  2. ట-వహించి, యబ్జ
  3. చ-వినాసమున, ట-విభాగమున
  4. ట-లో లేదు.
  5. తామరలవెన్ను విఱిచి