పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/85

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

మేరుసంగతి గేయసౌరవాహిని మూఁడుతెగ లాయె ననఁగఁ దంత్రికలు మెఱయ
స్వరదేవతారోహసమవరోహక్షోణిఁ గట్టు మెట్టికలు నా మెట్టు లమరఁ
గరివె ఫణంబుగా గానలోలత డాయు చిలువరా జన వెండియొళవు మీఱ
శ్రుతతంత్రికాబిసాహృతికి నేతెంచినకవజక్కవలు నాఁగఁ గాయ లొలయఁ
దనరువీణియఁ జేఁ బూని తంత్రి దీటి
బిరడలు బిగించి శ్రుతిఁ గూర్చి కరివె నివిరి
జాఱుగా మీటి సారెలు చక్కనొత్తి
సారెఁ బలికించుసత్యాకుమారుఁ గనియె.

118


క.

కనుఱెప్ప లిడక యతనిం, గనుఁగొనియుం చనిని చనక కామిని యన్నం
గనునెపమునఁ బొద వెలువడి, [1]చని నిలిచె న్మొగులు వాయుచంద్రకళ యనన్.

119


శా.

ఆవేళం దుదఱెప్పల న్నిలిచి [2]నేత్రాంతత్రిభాగంబులన్
డావై చెక్కుల జాఱి కర్ణవిచలత్తాటంకహీరప్రభన్
దీవ ల్సాఁగుచు నొయ్య రాకొమరుపై నిండారె రాజన్యక
న్యావీక్షాంకురముల్ స్మరప్రథమముక్తాస్త్రప్రతానం బనన్.

120


గీ.

పూపగుబ్బెతఁ గన సిగ్గు పొదలుచుండ
రాచకూతురు గాన సంకోచ మడర
నన్నసన్నిధి నున్కి భయంబు నిగుడఁ
గలికి గనుఁగొనఁ దలఁచు లోనులుకు నళుకు.

121


క.

వనజాస్యకు మై నిండ, న్నినుపారెం బులక లపుడు నిఖిలాంగములం
గనుఁగవసాటికిఁ దారుం, గనఁగఁ గటాక్షాంకురములు శ్రమించె ననన్.

122


[3]క.

తమినేత్రచకోరకయు, గ్మము నరపతివదనచంద్రికల నఱుమ్రోవం
గమిచి యెదఁ బట్టుచాలమి, నుమిసెనొ యన నశ్రుబిందు లొలికెం జెలికిన్.

123


ఉ.

తత్తఱపాటుతోడఁ గనుఁదమ్ములడాలు దిగంతరంబులం
జిత్తరు నింప లేఁజెమటఁ జేల కుచంబులపొంత జాఱ నా
బిత్తరి మ్రానుపా టొదవఁ బిమ్మిటిఁ దా నొకకొంత గొంకి లోఁ
జిత్తము మట్టు పెట్టికొని చేరి సహోదరుదండ నిల్వఁగన్.

124


ఉ.

అప్పుడు లేమపాదకటకారవము ల్నిజవల్లకీరుతిం
దప్పులు సూప వింతనినదం బిది యెక్కడిదంచు నెల్లెడం

  1. చ-చనియె న్జలదంబుఁ బాయు శశికళ యనఁగన్
  2. ట-నేత్రాంచద్విభాగంబునన్
  3. ట-లో లేదు.