పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/84

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గ్రక్కుపాటున రాజన్యకన్యఁ గాంచి
యపుడు వనపాలికలు రయవ్యగ్ర లగుచు.

110


క.

ఒండొకతె మీఱి నృపసుత, దండకు నేతెంచి మెట్టదమ్ములు విరిపూ
దండలుఁ గమ్మనిగొజ్జఁగి, చెండులుఁ గైకానికిచ్చి చేరి మృదూక్తిన్.

111


చ.

అచట విలాసభూధరము లచ్చటఁ గ్రొన్నెలఱాలతిన్నె ల
ల్లచటఁ బరాగసైకతము లచ్చటఁ దేనియయేటినీటిజా
లచటఁ బయోరుహాకరము లచ్చటఁ బూచినకన్నెమావు ల
ల్లచట లతాకృతాలయము లందుఁ గరంబులఁ జూప వారితోన్.

112


సీ.

విందులు గైకొన్నె యిందిందిరమ్ములు వాసంతికాప్రసూనాసనముల
దోమటి దొడుకునే ప్రేమఁ గోకిలములు పాటలసహకారపల్లవముల
బువ్వంబు గుడుచునే ప్రోదిరాచిలుకలు పరిపక్వదాడిమీఫలరసముల
బొ త్తారగించునే మత్తఖంజనములు చంపకస్రవనిజసౌరభముల
సామెతలు సేయునే శారికాన్వయములు
గోస్తనీవల్లికా[1]ఫలగుచ్ఛకముల
నలరువలపులు గాంచునే తలిరుఁబొదలు
మలయగిరికందరాయాతమారుతముల.

113


చ.

అనుచు లతాంగి పూవుఁబొద లారసి పుప్పొడితిప్ప లెక్కి కుం
దనవమరందవాహినుల దాఁటి సరస్తటిసీమ మట్టి పూ
చినయెలమావిజొంపములఁ జేరి [2]మెలంగుచు నంతఁ జెంగటం
గనుఁగొనియె న్లవంగలతికాపరికల్పితకాయమానముల్.

114


క.

కాంచి యచటం దదీయసు, మాంచలసంచరణచంచదళిగానకళా
వంచనచుంచువిపంచీ, పంచమనాదంబు చెవులపండువు సేయన్.

115


[3]మ.

ఇది నాయన్నవిపంచినాద మగుఁజుమ్మీ నెచ్చలీ యీలతా
సదనంబు ల్ప్రతినాద మూనఁదొడఁగెం జర్చింతమే యంచు మ
న్మదకాదంబరవానుకారివిచలన్మంజీరశింజారుతం
బొదవం జేరి సహోదరుం గనియె నత్యుత్కంఠ దీపింపఁగన్.

116


క.

సోనలుగాఁ గమ్మనిపూఁ, దేనియతుంపురులు చల్లుతీవలలో న
మ్మానవతి నిలిచి యన్నన్, గానరతుం గాంచి తదుపకంఠక్షోణిన్.

117
  1. ట-స్వచ్ఛ
  2. చ-తొలంగుచు
  3. ట-లో లేదు.