పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/80

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఓరీ సంపదఁ గన్నుఁ గానక వధూయుక్తుండ వై వచ్చి మ
మ్మౌరా యి ట్లడకింపఁ జెల్లునె దురాత్మా యంచుఁ గోపించి నీ
వీరూపంబు వహించి కాన జనతాహింసాదికృత్యంబులన్
నోరారం బొల మేసి త్రుళ్లు మని నన్నుం జూచి శాపించినన్.

81


క.

గజగజ వడఁకుచు నే నా, రజనీచరవేష ముడిగి ప్రతిపతిపాదాం
బుజములపై వ్రాలి భయా, ర్తిజదీనాలాపగద్గదిక ని ట్లంటిన్.

82


శా.

చేతోవీథి భవన్మహామహిమముల్ చింతింపఁగా లేక యీ
రీతి న్మన్నును మిన్నుఁ గానక మదోద్రేకంబునం ద్రుళ్లితిన్
నాత ప్పొక్కటి సైఁచి శాపవచనాంతంబుం గృపం దెల్పవే
యోతండ్రీ నను బ్రోవవే యనిన నాయోగీంద్రచంద్రుం డనున్.

83


శా.

వత్సా మామకశాపవాక్యములు దుర్వారంబు లౌ నైన నే
తత్సంరంభము మాని నీ [1]వడల నార్ద్రం బయ్యె నాచిత్త మీ
కుత్సాపాత్రతనూవియోగ మగు నీకు న్శూన్యదివ్యాప్తగా
భృత్సద్మాంతరసీమ నొక్కనిశరార్చిం గొంతకాలంబునన్.

84


క.

అనుమాట లోను వెలి గా, ఘనగర్జాతర్జనాదికస్ఫురణవచో
ధ్వని సెలఁగ రక్కసుఁడ నై, చనుదెంచితి నిటకు సకలజగములు బెగడన్.

85


ఉ.

నాపిశితాశనత్వమును నాబహుపాతకహేతునిత్యహిం
సాపరతంత్రరోషపరుషత్వముఁ బాపితి వీక్షణంబునన్
భూపవతంస నీవలనఁ బూర్వ[2]శుభోన్నతి నొందఁ గాంచితిన్.
నీపరమోపకారమహనీయత కేఁ బ్రతి సేయ నేర్తునే.

86


[3]క.

ఐన నొకమే లొనర్తు మ, హీనాయక మాఱువలుక కియ్యకొనుము ప్ర
జ్ఞానిధులు సత్క్రియాలవ, మేనియును బహూకరింపరే మది నెందున్.

87


చ.

అతులితశౌర్య నీతలఁచినప్పుడు వచ్చి సమిజ్జయంబు ల
ద్భుతముగఁ గూర్తు నీయరదముం దఱితోడయి వచ్చు నాయదృ
శ్యతయును గామరూపతయు సంధిలఁ జేయుదుఁ గొ మ్మటంచు నా
క్షితిపతి కిచ్చి యక్షుఁ డరిగెం దదనుజ్ఞ నిధీశువీటికిన్.

88


శా.

ఆసత్యాసుతుఁడుం బ్రియాప్తసహితుం డై యాత్మసౌరాస్త్ర [4]వి
న్యాసోచ్ఛాసితరాక్షసావయవయక్షాపాదితాత్యంతమై

  1. ట-వలన
  2. చ-సుఖోన్నతి
  3. ట-లోలేదు.
  4. ట-విన్యాసోద్భాసిత