పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

చొక్కపుఁబువ్వుజొంపములసొంపున మ్రాఁకులు విఱ్ఱవీఁగె నల్
దిక్కుల సావితావి నెలదేఁటులపాటల నీటుసూపెఁ బ
ల్పక్కుల కాకలీకలకలధ్వని మీఱెఁ జకోరి కోరికల్
నెక్కొనఁ బండువెన్నెలలు నిండె యథోచితవృత్తి నయ్యెడన్.

132


క.

కనుఁగవ మోడ్చి నిదిధ్యా
సనతత్పరుఁ డగుచు మస్తచంద్రసుధాసే
చనమునఁ దను దా నెఱుఁగని
మునిఁ గనుఁగొని యేము దాము ముం దని కడఁకన్.

133


సీ.

ఉడురాజు నిజనిశితోత్తాలకిరణసంఘముపేరి బలుచివ్వ గడలఁ జిమ్మి
మధుఁడు శాఖాన్యోస్యమర్శననిష్పతజ్జాలకావళిపేరి ఱాలు ఱువ్వి
పవనుండు పేఱెంబువాఱి గంధాయాతభృంగనిధ్యానంబుపేరఁ బిలిచి
శుకపికాదులు గరుత్ప్రకటధ్వనులపేర వివిభవాద్యంబుల రవళిఁ జూపి
కేశవపదాబ్దచింతారసాశయాంత
రాళగతమౌనిహృదయశుండాల మవశ
మగుట వెలి దార్పఁగా లేక హస్తి యిట్టు
లమితనిజశక్తి మీఱఁ బోరాడునపుడు.

134

చంద్రికాపరిణయము-ద్వితీయాశ్వాసము

సీ.

అరిరాజచిత్తభీకరకరకాండప్రచండిమ మను రాజమండలంబుఁ
గ్రొందళంబులఁ జాలఁ గూర్చుక హరివితానములతో జైత్రసేనావిభుండుఁ
గన్నుల నెఱమంట గ్రక్కుచుఁ గలరుతుల్ బెరయ నానావనప్రియబలంబుఁ
గనకరజోరేఖ గనుపట్టు వరగంధపటిమ రాజిలు మహాబలకులంబుఁ
దొలుదొలుత దీప్రవిస్ఫూర్తి దొడరి నడువఁ
జిలుకమేల్పక్కిపై నెక్కి యలరువింటి
దంట యమ్మౌని గదిసె దుర్దాంతశారి
కాళి యాత్మైకబిరుదపద్యములు చదువ.

76


ఉ.

అపుడు రణోత్సుకుం డగుసితాంబుజనాయకుకంటెసన్నఁ గీ
రపటిలి చల్లగాడ్పు తొవరాయఁడు కోయిలపౌజుఁ జైత్రుఁ డ
చ్చపుఁదెలిఱెక్కపుల్గు లనిసల్పఁగఁ జాలుదు నేనె నేనె యం
చపరిమితాగ్రహస్ఫురణ నమ్మునిఁ జుట్టిరి సత్వరంబుగన్.

77