పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/78

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కూలినదైత్యుఁ జూచి సురకోటి యమందమరందబిందువుల్
జాలుగఁ గ్రొవ్విరు ల్గురిసె జంత్రపుబొమ్మలరీతి జక్కిణుల్
కేళిక చేసి రచ్చరలుఁ గిన్నరకన్యక లున్ తశ్రుతిన్
మేళము గూడి పాడి రెలమిన్ యదువర్యుని సన్నుతించుచున్.

66


క.

కనుపట్టె నగ్రసరణిన్, ఘనదనహతవేత్రభసితకదళన్యాయం
బున విశిఖదగ్దదానవ, తనువున నొకయక్షరాజతనయుం డంతన్.

67


శా.

ఆయక్షాగ్రణి విస్మితాత్ముఁ డగుసత్యానందనున్ భక్తితో
డాయన్వచ్చి నతాంగుఁ డై పటుకిరీటప్రోతరత్నాంకుర
చ్ఛాయ ల్భూమి నలంకరింపఁగ నమస్కారంబు గావించి జే
జే యంచు న్వచియింప నాతఁ డనియెం జిత్తంబు రంజిల్లఁగన్.

68


[1]ఉ.

ఎక్కడ నుండు దెవ్వఁడ విదేమికతంబుకు రక్కసుండ వై
యిక్కడ సంచరించితివి యింతయుఁ దెల్పు మటన్నఁ గ్రమ్మఱన్
మ్రొక్కి యతండు హస్తములు మోడ్చి ఘనాఘనధీరనిస్స్వన
న్యక్కరణైకతానవచనస్ఫురణంబు చెలంగ ని ట్లనున్.

69


మ.

వెలయుం గాంతిమతీపురంబున మనోవేగుండు నా యక్షరా
ట్కులనాథుండు తదగ్రసూనుఁడ మణీకోటీరకాఖ్యుండ నీ
జలజాతారికళాకిరీటుఁ గొలువ న్సంప్రీతితో నొక్కనాఁ
డలఘుప్రౌఢిమ మీఱ నింద్రపురినీలాబ్జేక్షణల్ గొల్వఁగన్.

70


సీ.

బిందుమాధవుఁ డుండు నెం దబ్ధి [2]రిత్తయై ప్రకటఫేనాహికందుకము లెగయ
నిందుమౌళి వసించు నెందుఁ గైలాసంబు పాత్రగుహాచ్ఛిద్రపటలిఁ జెంద
నిరవొందులోలార్కుఁ డెం దుర్వి శూన్యమై బలుచుక్కగమి బల్లిపఱలు పురవ
మందాకిని తనర్చు నెందు మేరువు ఖిలంబై పచ్చిరాపూరి నావహింప
నట్టి కాశీపురంబున కరుగుదెంచి, యభినవభవాయమానజనార్థాంచిత
బహుళగీర్వాణవాహినీభ్రమదవజ్ర, శకలకుట్టిమ[3]వీథికాసరణి జనుచు.

71


శా.

కంఠేకాలపదారవిందములపైఁ గైవ్రాలి లోలార్కునిన్
డుఠీశు న్వినుతించి భైరవుని మోడ్పుంగేలుతో డాసి వై
కుంఠస్వామికిఁ జాఁగి మ్రొక్కి హిమవత్గోత్రాత్మజం జూచి యు
త్కంఠం దక్కినవేల్ఛులం బొగడి యంతస్మందయానంబునన్.

72
  1. ఈపద్యము మొదలు 10 పద్యములు ట-లో లేవు.
  2. చ-గులటయై
  3. చ-వాటికా