పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/70

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దొలుదొల్త నఖిలవిద్యలును నీరై జాఱు నామీఁద ఘర్మాంబు వడరు మేన
మొదట నే తపము సమూలంబుఁ జలియించు నామీఁదఁ బెదవి బిట్టదరసాగుఁ
గాన నూఱక శపియింప మౌనిపతికి, దీరునే యోయిమానిసిదిండితబిసి
విసపుఁజెట్టున కూడలు [1]విడిచినట్లు, జడలు జనియించి చెఱిచె మస్తమున నీకు.

24


చ.

ముని నని పేరు పెట్టికొని ముక్కునఁ గోపముఁ దాల్చి యీగతిన్
జనుల శపింప దీన నొకసద్గతి గల్గునె మర్త్యమాత్రులే
వనజదళాక్షనందనులు వారలు వారలఁ జూడకున్న న
ద్దనుజవిభేదిఁ జూడవలదా ఖల దారుణ ధూర్తవర్తనా.

25


[2]క.

అని యనితరసహ్యం బైఁ, గనగనమనుచూడ్కిఁ గోపకళ క్రాలుకొనన్
ముని మునిసి యత్రితనయుం, గని కనికర ముడిగి పలికి కటకటఁ బడినన్.

26


క.

రోషారుణాక్షివీక్షా, భీషణవదనంబుతోడఁ బెదవు లదర నా
దోషాకరానుజుఁడు కటు, భాషణముల వ్యాసుఁ జూచి పలికెను గలఁకన్.

27


ఉ.

వంచన నావనంబునకు వచ్చి మదించి దయావిహీనులై
పెంచిన యేణశాబముల బి ట్టదలించినఁ జూచి నేను గో
పించి యథోచితంబుగ శపించితి నిందుల కీవు వచ్చి గ
ద్దించఁగ నేమికారణము దెల్పఁగదోయి భవత్ప్రతాపముల్.

28


[3]క.

వాకిలి చెఱచినఁ జాలున్, సాకిరి బలికెద నటంచుఁ జనుదెంచి కడుం
జీకాకువడఁగ నాడిన, నీకు న్వెఱచెదమె తెలియనేరవు మమ్మున్.

29


చ.

నను మునిమాత్రు నాడుగతి నాటఁగ నాడిన నేఁడు నీకు నే
ననునయభాషణంబులఁ బ్రియంబులు పల్కుదునే యమర్షసం
జనితనితాంతభీషణనిశాతకశాతరళేక్షణంబులం
గినుక నడంతుఁ గాక [4]వెడగిర్పులు నాయెడ మాను మం చొగిన్.

30


స్రగ్ధర.

క్రుద్ధుండై బల్విడిం బల్కుచు నపుడు దృఢాకూరితాహంక్రియాసం
బద్ధద్వేషంబుతోడం బ్రళయశిఖిగతి న్మండుదుర్వాసు వ్యాసుం
డిద్ధామర్షంబుతో బి ట్టెగసి పలికె వా రిద్దఱుం దాళలేక క
త్యౌద్ధత్యం బొప్ప నన్యోన్యము శపనవిధాయత్తు లై యుండునంతన్.

31
  1. చ-వీఁగినట్లు
  2. ట-లోఁ బద్యమునకుమాఱు “అనిన" అనుమాటమాత్రము గలదు.
  3. ట-లో దీనితో నైదుపద్యములకు “ఆయిద్దఱుం బెద్దప్రొ ద్దుద్దవిడిం బిఱుతివియక పోరునెడ నబ్బాలకద్వయంబు" అనువచనముమాత్రము గలదు.
  4. చ-వెడకిర్దలు