పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/69

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తలఁపరే యరవిందధామునిల్లాలి ధాత్రికిఁ గూల ద్రొబ్బినదిట్టతనము
చూడరే రోఁకటిచూలికై సాంబుతోఁ దమునెల్లఁ దిట్టినదంటతనము
పెక్కు లేమిటి కరయరే భీషణాక్షి, వీక్షణాక్షుద్రరూక్షాశుశుక్షణిక్ష
ణోక్షిపజ్జ్వాలికలలోక మొక్కమొగిన, భస్మముగఁ జేయఁజాలిన బంటుతనము.

17


క.

అని శము లోహో యన ముని, యనిశములో నడరురోష మగ్గల మగుచుం
గనికరము మాఁపఁ జుఱచుఱఁ, గని కరమున శాపజలముఁ గైకొనునంతన్.

18


సీ.

బహుకాలసాధ్యతపస్స్వ మేటికి మంటిపాలు సేసెద నని పలికె నత్రి
యాదవాన్వయులఁట యన్న యీతెగువ నీ కనుచితం బనెఁ గర్దమాత్మజాత
సాంజలియై యుపాధ్యాయ యీయొకతప్పు సైరింపు మనియె శిష్యవ్రజంబు
అంతకు నెంత నీ వటువలెఁ గోపింప నది లక్ష్యమా యని రన్యమునులు
మఱియుఁ దలకొకమాటగా మౌనినాథ, తాళుమన సడ్డసేయక తపసి నిజమృ
గంబు లె ట్లట్ల వారును గవ దొఱంగి, కలఁగ నిమని శాపోదకంబు విడిచె.

19


క.

అట్టిమహారభసపుఁదఱిఁ, జెట్టున డిగినట్టు లగ్రసీమ మొలచిన
ట్లుట్టిపడినట్టు [1]మౌనుల, కట్టెదుట న్వ్యాసమౌని గనుఁగొననయ్యెన్.

20


సీ.

సత్యవతీమానసము నొందుహంసేంద్రు ముడివడునిడుదకెంజడలవాని
భరతరాజాన్వయోద్ధరణుఁ డై మనుసౌమ్యు విరిదమ్మిపూసలసరమువాని
వాసిష్ఠవంసాప్తి వఱలుముక్తాగ్రణి పలుచనినిడుయోగపట్టెవాని
నలఘుభారతకళాకలితుఁ డొసత్పతిఁజిఱుత [2]పప్పళివన్నెచేలవాని
బ్రాక్తనవచోవిభాగవైభవధురీణు, గేల మున్నీటిక్రొన్నీటిగిండివాని
నాపరాశరపుత్రు నుద్యత్ప్రకోప, రౌద్రతరనేత్రుఁ గాంచి దుర్వాసుఁ డపుడు.

21


క.

సవసవవినయముఁ బల్కుచు, నవనతగతిఁ దోడి తెచ్చి యాతిథ్యంబుల్
సవరించిన నమ్మునిపతి, యవి గైకొన కనియె భీషణార్భటి మెఱయన్.

22


ఉ.

బాలురు పుట్టుభోగులు నృపాలతనూభవు లెండకాఁకచేఁ
దూలినవారు నిద్రతమిఁ దోఁగెడువా రొకతప్పు సేసినం
దాళక యేల కావరమున న్శపియించితి వోయి యిట్టినీ
కేల మునిత్వ మేల జన మేల జటాధర మేల నేమముల్.

23


[3]సీ.

మునుమున్న యపకీర్తి జనియించి నటియించు నామీఁద భ్రూయుగం బాడు నుదుట
ముంగల దురితసమూహంబు లుదయించు నామీఁదఁ బులకంబు లంకురించుఁ

  1. చ-తపసుల
  2. చ-పుప్పొడి
  3. ట-లో లేదు