పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/68

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కని రలదుర్వాసుతపో, వనము న్సతతోజ్జ్వలత్సవనముం బుణ్యా
వనము న్సంయమిపదపా, వనమున్ జనదుష్క్రియానివహధావనమున్.

9


క.

కనుఁగొని యానందము నె, మ్మనమునఁ దళుకొత్త ధరణిమండలపతు ల
వ్వనమధ్యము దఱియఁగఁ జని, కనుఁగవలకు మోద [1]మిడు నొకానొకచోటన్.

10


ఉ.

మార్గాయాసము పో నికుంజపటలీమధ్యంబు సొత్తెంచి యం
తర్గేహంబునయందపోలె సుఖనిద్రం జెంది రుల్లోలసం
సర్గానర్గళభానుజానిలసదాసంఘృష్టరంభావనీ
వర్గోత్తాలపలాశవీజనముహుర్వ్యాధూతఘర్మంబుగన్.

11


ఉ.

ఆయెడ నాశ్రమైణయుగ మచ్చట నచ్చట లేఁతపచ్చికల్
మేయుచు సారె నొండొకటి మేనులు మూర్కొనుచు న్రయంబునన్
డాయఁగ వచ్చి యాధరణినాథుల [2]మౌనిజనభ్రమంబునన్
రాయిడిఁ జేసెఁ బైఁ బడి చిరంతనతాదృశవాసనారతిన్.

12


చ.

అలయిక నిద్రవోవుతఱి నాగతి సారెకు రాయిడించినన్
దెలిసి తటాన మేలుకని దిగ్గున లేచి యదూద్వహు ల్దముం
గలఁగుచుఁ జూచి చెంగునను గంతులు వేయుచుఁ బాఱునట్టి జిం
కల బెదరించి జోడు దలఁగం గలగుండు వడంగఁ దోలినన్.

13


చ.

మిగుల భయార్తి నొండొకటి మించఁగ రెండును రెండుదిక్కు లై
తగ బుసకొట్టుచుం బొదలు దాఁటుచుఁ గ్రమ్మఱి చూచు చుప్పరం
బెగయుచు గాలిఁ దీన చలియించిన ననఁ దొలంగిపోవుచున్
దిగులున నచ్చి యమ్మునిపతిం గని యుల్కుచుఁ జెంత నిల్చినన్.

14


శా.

ఆదుర్వాసుఁడు వానిఁ జూచి యపు డత్యంతారుణాపాంగవీ
క్షాధామంబులు దిగ్విటంకముల నుల్కాజాలము న్నింప మ
ర్యాదాలంఘనజాంఘికాగ్రహముతో నౌరా మదీయైణలీ
లాదాంపత్యముఁ బాపె నెవ్వఁ డని యల్కన్ ధ్యానసంసక్తుఁ డై.

15


క.

యదునాథనందనులఁ గా, మది నెఱిఁగి కటంబు లదర మౌని కటకటా
తుదమొద లెఱుఁగక మదమునఁ, జెదరినమది నింత సేయ చెల్లున యనుచున్.

16


సీ.

ఎఱుఁగరే దేవతాధీశుసంపద లెల్లఁ గడలిలోఁ గలిపినగబ్బితనము
మఱచిరే సత్యభామామురారుల బండి[3]గొడ్డులఁ జేసినగొడ్డతనము

  1. చ-మొసఁగఁగా
  2. చ-మౌని భ్రమంబున న్వడిన్
  3. చ-గోల చేసినయట్టి