పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

చెలికానికేలునం గేల్, నిలిపి కొలిచి వచ్చుజనుల నిలునిలుఁ డని
బలుమాఱు మౌనిచర్యలు, పలుకుచు వేఱొక్కపువ్వుఁ బందిలి.

178


శా.

గాంభీర్యాంబుధిరాజు రాజధరవాక్ప్రాణేశపత్రిప్రభా
శుంభత్కీర్తిసమాజ మాజనకచక్షుర్వైఖరీవంచితా
హంభావామరభూజ భూజననికాయస్వాంతభృంగావళీ
సంభావ్యాంఘ్రిపయోజ యోజకవిధాసంప్రీణితారణ్యకా.

179


క.

అక్షీణయోగశిక్షా, దక్ష జగత్త్రితయసాక్షితాదీక్షిత దు
ర్లక్షచిదక్షహృదక్షమ, దక్షపణక్షమధురాపదక్షాంతినిధీ.

180


తరళము.

స్వరధిరాజసదనరాజసఖముఖీజనాతిభా
స్వరశిరోజనవసరోజసరసమాజసంతతా
చరితపూజ సవితృతేజ జపితృయాజకచ్ఛటా
సురధరాజ శుచిధరాజశుభసభాజనోన్నతా.

181


గద్యము.

ఇది శ్రీమద్దత్తాత్రేయయోగీంద్రచంద్రచరణారవిందవందనసమాసాదిత
సరసకవితారసోదాత్త దత్తనామాత్యసోదర్య మల్లనమంత్రివర్యప్రణీతం బై
నచంద్రభానుచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ ద్వితీయాశ్వాసము.