పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/62

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

కదలక మెదలక పైపైఁ, బొదలెడు గాంభీర్యధైర్యములతో యతి య
మ్మదవతిఁ దదనుచరుల న, య్యదనం గైకొనక యచలుఁ డై యుండుటయున్.

149


సీ.

చవి యెఱుంగవు గాక యవుదల చంద్రామృతంబు తొయ్యలియధరంబు సరియె
విన నెఱుంగవు గాక విశదనాదానుభావంబు పైఁదలిమణితంబు సరియె
తగ వెఱుంగవు గాక యగణితాసననిబంధము లింతిసురతబంధముల సరియె
తలఁ పెఱుంగవు గాక దహరోద్గతారవిందమ్ము భామినీవదనమ్ము సరియె
కానఁ దనుయోగమునకు సమాన మగునె
కానఁ దనుయోగమునఁ జెందఁగలసుఖంబు
మదనుమత మింత తలపోసి మౌని యింక
మదనుమత మాత్మ వదలక మనఁగదయ్య.

150


ఉ.

తేరకుఁ దేరఁగా భవదదృష్టవశంబున నేఁడు చెంతకుం
జేరిన మమ్మ గారవము సేయ నెఱుంగవు గాక యాత్మలో
నారసిచూడు మేమిఫల మందుట కుంకువలై తనర్చునో
ధారిణిఁ జేయుజన్నములు తాపసవృత్తులు వీరకృత్యముల్.

151


సీ.

ఏడాకుల నఁటుల నెనయుకప్రము గల్గ బూది నెమ్మెయినిండఁ బూయ నేల
వైణవమౌక్తికవ్రాతమ్ము గలుగంగఁ బటికంపుఁబేరుఁ జేపట్ట నేల
పూచినగురివెందపొదరుటిండులు గల్గఁ గాఱాకుగుడిసెల దూఱ నేల
మృగనాభికాగళన్మృగనాభి కలుగంగ బిల్లవేలిమిబొట్టు పెట్ట నేల
[1]జడను బూని కటా సదసద్వివేక, చాతురి మనోఙ్ఞమునఁ బూనవైతి గాక
తెలియనేర్చిన నీ కానఁ గలిగినవియె, యరసి సుఖియింపఁగారాదె సరసులకును.

152


మ.

అనుధావద్వరహంసమండలము మాయానంబు దాస్యావలం
బనసోత్కంఠవనప్రియప్రకరము ల్మాపాట లింతేల మా
యనుఁగు౦బ ల్కనుభాషమాణశుక మాహా యిట్టిమాబోంట్లశా
తనిరీక్షారుచిధార కబ్రమె భరద్వాజా నినుం బైకొనన్.

153


క.

కిలికించితలీలాగతిఁ, దిలకింపవు మృదుమదీయదేహాసక్తిం
బులకింపవు లేనగవులఁ, జిలికింప వి దేమి ఱాఁతఁ జేసిరె నిన్నున్.

154


క.

అని చంద్రరేఖ యీగతి, మునిపతిఁ గొసర న్వసంతముఖ్యులు గడిమిన్
మొనసి తమతమకతమకం, బునఁ గదియుచు మరున కిదియెపో నం దనినన్.

155
  1. చ-ట-జడత