పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/60

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

మౌనికడ కేగె నతఁడును, మానస మానంగబలసమాగతివలనన్
ధ్యానంబు వదలఁ గాంచెన్, నానాదిక్కులను దత్క్షణంబున నదియున్.

136


గీ.

చెలులు సేవింప రత్నకాంచికలు మొఱయ, నల్లనల్లన [1]నతని డాయంగనేగి
గరువమును నీటు మురిపంబుఁ గలికితనము, నారజంబును మెఱయఁ దదగ్రసరణి.

137


సీ.

తరుల కొయ్యన నిక్కి విరు లందునెపమున బాహుమూలద్యుతు ల్బయలుపఱిచి
ముంజేతిచిలుకకు ముద్దిచ్చునెపమునఁ దావికెంజిగురాకుమోవి సూపి
చెమట లార్పమలంచి చెఱఁగూనునెపమున నిఱిగుబ్బచనుదోయి మఱుఁగుఁ బుచ్చి
యలులు మోమునఁ జేర మలఁగెడునెపమున నునువాలుఁగొప్పు గన్గొనఁగఁజేసి
కినుక నుడిగంపుఁజెలి నల్గి కనునెపమున
గొనబునెలవంకబొమల జంకెనలు దెల్పి
యనుఁగుబోటులతోఁ గూడి యామృగాక్షి
సముచితవిలాసముల డాయుసమయమునను.

138


శా.

కేలం బంగరుగచ్చుకోల లమరన్ గీర్వాణబాలామణుల్
శ్రీలీలావతిపట్టికట్టికలవారిం బోలి తజ్ఙైత్రవి
ద్యాలాలిత్యము లుగ్గడించి మృదులాలాపంబులం బాడుచుం
గోలాటంబులు వైచి రాయతి తముం గూర్మిం గటాక్షింపఁగన్.

139


క.

మలఁచి వలమూఁపుపైఁ గీ, ల్కొలిపినపాదంబుమీఁదఁ గొమరగులికుచం
బలఘూన్నాళాంభోరుహ, తలకర్ణికఁ దెగడ నొకతె తాండవమాడెన్.

140


[2]గీ.

పాంథమృగయకుఁ జనుమరుపజ్జఁ ద్రిప్పు
భర్మమయదండబర్హాతపత్ర మనఁగ
మెఱుఁగుమెయిదీఁగ వలగొనఁ దుఱుము బొదలఁ
దెఱవయొక్కతె బిఱబిఱఁ దిరుపు గట్టె.

141


గీ.

తముఁ గలసి యష్టభూతు లింతకును గొనరు
వేల్పు లని తెల్పుగతి బొటవ్రేల నెనయఁ
దర్జనిఁ జెఱంగుఁ గీలించి తక్కువ్రేళ్లు
మించి నిక్కంగ దేశి నటించె నొకతె.

142
  1. క-మౌని
  2. ఇదియుఁ గ్రిందిగీతమును ట-లో లేవు.