విఘాతమ్మున కేగుమార్గమునఁ గుముదుఁ డనుశాపోపహతగంధర్వుఁడు చంద్రికారూపాతిశయమును వర్ణించుటయే కాక తాను వసుచరిత్రముం జదివినవాఁడుం బోలెఁ దనతో రాజును జంద్రికకడకుఁ దోడ్కొనిపోయి నాయికానాయకులకుఁ బరస్పరానురాగము సంఘటించెను. చంద్రభానుఁడు లోకసామాన్యముగ విద్యార్థివేషమునఁ దుంబురుపరిచర్య సేయుచు నొకనాఁడు కార్యవశమున నేతెంచిననాయికం జూచి మదనపరతంత్రుం డై తుద కామెపాణి గ్రహించెను. సుచంద్రుఁ డట్లుగాక యకారణబాంధవుం డగు నామునివాక్యములు వినినంతనె కామపరవశుఁ డై యెక్కడనో యున్ననాయికం జూడ వేడుకపడి వానివిమానమున నాయికోద్యానముం జేరి తుదకుఁ దద్దర్శనలాభము ననుభవించెను.
చంద్రికాపరిణయమునందలి నాయకతండ్రి నైషధీయచరితముం జదివినవాఁడుఁబోలెఁ దనకూఁతుమనంబు సుచంద్రలగ్న మయ్యె నని యెఱింగియు సాటికి స్వయంవరము చాటించెను. స్వయంవరకాలమునఁ జంద్రికకు భూపాలురప్రతాపాటోపాదికమును వర్ణింపఁ బార్వతిని నియోగించెను. పార్వతియు నైషధీయభారతిం బోలె భువనేశ్వరమంత్రమును సుచంద్రున కుపదేశించి యంతర్హిత యయ్యె. చంద్రభానుచరిత్రములోని నాయికానాయకులు రుక్మిణీస్వయంవరము నెఱిఁగినవారు గనుక మాయవలన నేమి యేవిధముననైన నేమి సర్వావస్థలను వారినే యనుకరించిరి. రుక్మబాహుండును దనతనయను శిశుపాలునితనయునకే యొసంగ నిశ్చయించి వియ్యమును రావించి యతనికి ద్వితీయపరాభవమును గూడ సంఘటించెను. చంద్రభానుఁడు కాదంబరీరసాస్వాదనపరవశునట్టులు తనకు సాత్యకితనూభవు నొకని దోడు చేసికొని యడవిలో మృగయావ్యాపారమునఁ జంద్రాపీడుఁడువలెఁ దాను గానవిద్యాభ్యాసమిషంబున స్వజనులఁ బాసి దుర్వాసశ్శాపగ్రస్తుఁ డై యాతండు కిన్నరమిథునముఁ బట్టఁబోయి యేకాకియై గానపరవశయగు మహాశ్వేతం గాంచి తద్వారమునఁ గాదంబరీలాభము నందినయట్టులు వనమయూరములం బట్టఁబోయి శాపవశమున నేకాకియై గానాచార్యుం దుంబురుం గని తన్నికటమున విద్య నభ్యసించుచుఁ గుముదినీలాభముం బొందెను. కాదంబరిలోని పుండరీకునట్లు నిందు విజయలోలుఁడు శాపతాపితుఁ డై యొకవత్సర మెట్లో చరించి తుద కనురూపకాంతాసమాగమమును బ్రధాననాయకునితో సమముగ నందెను.
ఇ ట్లీరెండుగ్రంథములకు భిన్నభిన్నగ్రంథానుకరణములును సాధర్మ్య