పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/59

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

తొగరువన్నె గుజ్జుచిగురుమామిడినీడఁ, జేరి కేలఁ బూలకోరికోల
మెఱయఁ ద్రిప్పుకొనుచుఁ బెఱ[1]కేలఁ దియ్యవి, ల్లూఁత గాఁగ నిలిచియుండుటయును.

130


సీ.

నిడుచాలు వెనుచాయ నడకనిద్దపుఁదేఁటిగమి వీరజడలతో గంధవహుఁడు
చెలువంపుమైకప్పు జిగిసురమా వింతవగజగబిరుదుతో మృగధరుండుఁ
జొక్కంపుఁదుదిఱెక్క సోఁకుపుప్పొడిరేక పసుపుఁబావడలతోఁ బక్షి[2]కులముఁ
దొగరువన్నియమావిచిగురుమొత్తంబు క్రొంబగలుపంజులతోడ మాధవుండుఁ
బ్రకటగతి వచ్చి యహమహమికల మాక
మాక యుత్తరు వనుచు సంభ్రమ మొనర్ప
వారిఁ గరుణార్ద్రదృష్టిచే గారవించి
మునివరునిమీఁద సెలవిచ్చి పనుపుటయును.

131


ఉ.

చొక్కపుఁబువ్వుజొంపములసొంపున మ్రాఁకులు విఱ్ఱవీఁగె నల్
దిక్కుల సావితావి నెలదేఁటులపాటల నీటుసూపెఁ బ
ల్పక్కుల కాకలీకలకలధ్వని మీఱె జకోరికోరికల్
నెక్కునఁ బండువెన్నెలలు నిండె యథోచితవృత్తి నయ్యెడన్.

132


క.

కనుఁగవ మోడ్చి నిదిధ్యా, సనతత్పరుఁ డగుచు మస్తచంద్రసుధాసే
చనమునఁ దనుఁ దా నెఱుఁగని, మునిఁ గనుఁగొని యేము దాము ముందని కడఁకన్.

133


సీ.

ఉడురాజు నిజనిశితోత్తాలకిరణసంఘముపేరి బలుచివ్వగడలఁ జిమ్మి
మధుఁడు శాఖాన్యోన్యమర్శననిష్పతజ్జాలకావళిపేరి ఱాల ఱువ్వి
పననుండు పేఱెంబువాఱి గంధాయాతభృంగనిధ్వానంబుపేరఁ బిలిచి
శుకపికాదులు గరుత్ప్రకటధ్వనులపేర వివిధవాద్యంబులరవళిఁ జూపి
కేశవపదాబ్దచింతారసాశయాంత, రాళగతమౌనిహృదయశుండాల మవశ
మగుట నెలిఁ దార్పఁగా లేక హత్తి యిట్టు, లమితనిజశక్తి మీఱఁ బోరాడునపుడు.

134


సీ.

తమ్ముఁ బైకొనుకన్నుఁ దమ్ముల శ్రుతు లవతంసాళి రుతిపేరఁ దఱచు దూఱఁ
గరకంజరమకుఁ గంకణము లంతర్మణి స్వనములపేర నెచ్చరికఁ దెలుప
ఘనతరస్తనభారమున కుల్కి లేఁగౌను మొలనూలిరొదపేర మొఱలు పెట్ట
నడుగుఁదామరలకు హంసకంబులు చిఱుగంటమ్రోఁతలపేర గతులు దెల్ప
నడరు చంద్రకళాభిధానాప్సరోల, లామ లావణ్యవైభవాలంక్రియాభి
రామ యామన్మథునియగ్రసీమ నిల్చి, చిత్తగింపుము సన్ననిసెలవుఁ బూని.

135
  1. చ-చేత
  2. చ-గములు, ట-బలము