పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నుతిఁ గను నీసరసియదూ, రతరక్షితిఁ జూచితే భరద్వాజమహా
యతిభవనం బతిభువనం, బతినవనంబునకుఁ బాత్ర మై కనుపట్టెన్.

120


సీ.

కలికాలవిప్రసంగతపలాశశ్రేణిఁ బటుశిలీముఖములపాలు సేసి
నిర్గళన్మధుమదోన్నిద్రపున్నాగాళి ధీరాశుగశ్రేణిఁ దెరలఁ జేసి
నిశితకంటకశరాన్వితమన్మథస్ఫూర్తి నమితమహాజిహ్మగముల నలమి
చటులశాఖాగదాసాంద్రశారికదళంబులఁ బత్రముఖసమాకలనఁ ద్రుంచి
చతురగుణయుక్తధర్మసంసక్తిఁ బొదలి, బహుమహాహవసన్నాహభరిత మగుచుఁ
గనుము చెలికాఁడ మునితపో౽వన మొనర్ప, వలసి నిలిచినగతిఁ దపోవనము దనరె.

121


చ.

అలయజుఁ డాకసంబునకు నాదరు వేమియు లేమిఁ బ్రాపుగా
నిలిపిన కప్పుగంబములనీటుల సధ్వరధూమము ల్దగు
న్మలినపదుండు మౌనులసమక్షమునన్ శుచి యౌట నాతనిం
బొలయక పాసి పోయెడు తమోగుణపుంజముబోలె నిచ్చలున్.

122


సీ.

పుండరీకములపెంపునఁ బొల్చు సారంగ మూహింపఁగా నిది యోగ్య మనఁగ
నలరుపంచాననైకాప్తినాగశ్రేణి యరసి కాంచిన నిది యర్హ మనఁగ
నకులానుబంధసంధానంబుఁ గను చక్రి దర్శింప నిది యుచితం బనంగఁ
బరఁగుఁ గౌశికయుక్తిఁ జిరజీవివర్గంబు తలఁచిచూచిన నిది తగు ననంగ
విషమసాయక యిచ్చటివిబుధవర్యు, లలఘుతరశబ్దశక్తి నాత్మ్యార్థగతవి
రోధములు మాన్చి మనుప నారూఢమైత్రి, యావహిల్లుట చిత్రమే యహరహంబు.

123


గీ.

హ్రాదినీసక్తు లై కరకాభిరాము, లై యనంతపదాధీను లై నితాంత
వారితాహంకృతులు నైనవార లిచటి, మునులు దలపోసి చూచిన ఘనులు గారె.

124


చ.

కళికలు చాలఁ జాలుకొనఁగాఁ దగుపాళెలఁ జాలుకీలకాం
చలములు నిండ ముత్తియపుజల్లులమొల్లమి సూపఁ బూగముల్
చెలఁగెడుఁ గంటె శంబరవిజేతుృకశాసనసుస్థితాత్ము లై
యలరెడుమౌనిరాజులమహాతపవారణరాజులో యనన్.

125


సీ.

శ్యామలు సౌరభ్యశాలిమధూళిచేఁ దైర్థికావళికిఁ బాద్యము లొసంగఁ
గొమ్మలు పాకానుగుణఫలప్రతతిచే నభ్యాగతులకు నాహార మిడఁగ
లతకూన లనిలలోలప్రవాళములచే వైదేశికులకు వీవనలు విసర
మహిళలు కుసుమకోమలదళశ్రేణిచేఁ బాంథసంతతికిఁ దల్పము లమర్ప