పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/56

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ర్చనముల్ చల్పి స్వపార్శ్యవర్తులకుఁ దీర్థం బిచ్చి సేవార్థమై
చనువారిం గనుఁగొంటివే మదన సాక్షాధ్వ్యాసమౌనీశులన్.

113


ఉ.

త్రోవనె దృష్టి నిల్పి తడిదోవతి మూఁపునఁ దాల్చి స్తోత్రపా
ఠావళితాస్యులై శయచయంబులఁ జెంబులఁ బూని యేగునీ
కేవలపుణ్యమూర్తుల నకించనవృత్తుల రంగనాథస
ప్తావరణప్రదక్షిణపరాయణులం గనుఁగొంటె మన్మథా.

114


సీ.

అగ్రహారముల మాన్యక్షేత్రములఁ బండుగరిసెలకొలు చరకాండ్రు నింప
సతతంబుఁ బైరుపచ్చలుఁ దోఁటదొడ్డులుఁ గావలు లరసి రక్షణ మొనర్పఁ
గీలార్లు పెరుఁగునుం బాలు మందలనుండి వడి ఱేవుమాపుఁ గావడులఁ దేరఁ
బైవెచ్చమునకుఁ దప్పక రూక పాతికల్ ప్రియశిష్యతతి సమర్పించి యెసఁగ
నతిథిసంతర్పణంబె నిత్యవ్రతంబు, గాఁగ వ్యాఖ్యానమునఁ బ్రొద్దుఁ గడపి గేహ
దేవతార్చన మఱవక భావశుద్ధిఁ, దనరు నచటిగృహస్థులఁ గను మనంగ.

115


సీ.

అక్కున వనమాలికాగతభృంగమో శ్రీవత్సమో విభజింపరాదు
జఘనసీమ సువర్ణశాటీద్యుతియొ నాభినలినపరాగమో తెలియరాదు
పదమున దేవతాపగవీచియో నఖరేందుమరీచియో యెఱుఁగరాదు
తనువున నర్చనాదత్తసూనంబులో పాఁపమేపొరలో యేర్పఱుపరాదు
కాంచితె మనోజ కించిదాకుంచితాంఘ్రి, యుగ మిలారమ లొత్తఁగా నొత్తిగిల్లి
కటి నొకకరంబు సాఁచి యొక్కటి తలాడ, నమరఁ బవళించియున్నరంగప్ప నిపుడు.

116


క.

ఈరీతిఁ జెలువు మెఱసిన, శ్రీరంగాధిపునినగరిచెంత మధురసా
సారససారసమున్నత, సారససారసరుతుల్ దిశాతతిఁ గప్పెన్.

117

భరద్వాజాశ్రమవర్ణనము

క.

అదె కనుఁగొంటివె మదనా, మదనాగకిశోరవదనమంజులరదనా
రదనాళకమలసదనా, సదనాహతవారికరిణి శశిపుష్కరిణిన్.

118


సీ.

దరనమ్రదళసముద్దతనాళసితకంజగణములు పుండరీకంబు లనఁగ
నురుమీనమస్తరంధ్రోత్థానధారానికాయంబులు ప్రకీర్ణకంబు లనఁగ
రయశాలిమారుతప్రచలత్తరంగజాలము లుత్పతద్బహులహరు లనఁగ
నంబుపూరాంతరబింబితజలకదంబంబు ఘనాఘనౌఘం బనంగ
సమదకవిరాజహంసచక్రములు చేరి, సతతము భజింపఁ దీర్థరాజప్రసిద్ధి
నెఱువు నీచంద్రవుష్కరిణీ సరోవ, రంబు వినుతింప శక్యమే బ్రహ్మకైన.

119