పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/54

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సూనసాయక తా మెంత సుడులఁ బడిన, సాటి సేయంగఁ దగునె యసహ్యగోత్ర
జాత లౌనన్యనదుల నీసహ్యగోత్ర, జాతకు ననంతభువనవిఖ్యాత కరయ.

100


గీ.

తను విగాహించి హతులైనజనుల కొసఁగ, శంఖచక్రశతంబు లీసహ్యతనయ
సంతరించినగతిఁ బొల్చె సరసశర క, నుంగను వినిర్మలాబ్జరథాంగతతుల.

101


చ.

కలమవనాళి పండి యొరఁగంబడి యెన్నుల నీరెడల్చుటల్
గలయఁగ వంక లైన మడికట్టలు బీటలసందు దూఱఁగాఁ
జెలువు వహించె నెల్లెడలఁ జిత్రము పూవిలుకాఁడ వ్రేళ్లనుం
గొలుచుగఁ బండినట్లు కనుఁగొంటివె యీతటినీతటంబులన్.

102


శా.

సారె న్నారికెడంపుబొండలము లీక్ష్మాఁ ద్రెళ్లి తో వ్రీలుటన్
నీ రేఱై తొరఁగ న్స్వపర్ణపటలీనిర్వన్నవస్థూలము
క్తారాజి న్నవబుద్బుదాళి నిలిపెం గాంతారకాంతారకాం
తారంబు ల్తిలకింపు మయ్య రతికాంతారమ్యదేశంబులన్.

103


మ.

ఫలభారానతనారికేళ వనరంభాపూగభూజావళీ
కలమారామచయ౦బుచే సతతరంగత్తుంగభంగాంబుని
ర్మలవాతంబులచేఁ దటస్థులకుఁ బ్రేమన్భక్తియు న్ముక్తియుం
గలుగంజేసి తనర్చునీతటిని వక్కాణింపఁగా శక్యమే.

104


సీ.

సరసరాజీవాజిచలరాజిరాజినినాదభేదములు సంమోద మొసఁగ
సమసమాలీనాళిసుమధూళిపాళికారామసీమములు సంభ్రమముఁ గూర్ప
దరవరాళీకేళివరబాలికాళీవిహారతీరములు నెయ్యమున ముంపఁ
దటతటాకానీకపటుసైకతాకరమంజుమంజరులు సమ్మదము దన్ప
నతతతతభంగసంగసంచారివారి, కరటిరటితాబ్దశబ్దసంఘాతభీత
సకలకలహంససంసత్ప్రచారసార, యమితమితవాతపోతంబు లందగింప.

105


క.

శ్రీరంగభర్త యీనది, తీరంబున నున్నవాఁ డదె తదీయశుభా
గారంబుఁ జూడు మణిరుచి, పూరంబుల నకృతచిత్రములు గలదానిన్.

106

శ్రీరంగపురవర్ణనము

సీ.

ప్రాతరాశుగమిళత్ప్రబలగోపురగవాక్షధ్వను ల్కల్యశంఖస్వనములు
రవిరథ్యఖురహతప్రాసాదనాదముల్ మధ్యాహ్నఘంటాసమక్వణములు