పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గురిసెం గోరికతోఁ జకోరమహిళల్ గ్రుక్కిళ్లు మ్రింగన్ ధను
ర్ధరుఁడై పంచశగుండు భూతలముఁ జేరన్ దిక్కులం దొక్కటన్.

94


చ.

తొలఁకులఁ దేలి పుప్పొడులఁ దూలి మరందముఁ గ్రోలి కన్నెతీ
వలవయి సోలి క్రొన్ననల వ్రాలి హిమంబుల నేలి వాసనల్
గలయఁగఁ జేయఁ జాలి చలిగాలి తగ న్హరిచూలిమీఁదటం
బొలసె మరుద్రథానికటభూరుహకేళిఁ జలాళిపాళియై.

95


ఉ.

క్రేవఁ గవేరకన్య లహరీవిహరద్బహుసొరసారసా
రావవిశేషమాన్య నళిరాజరథాంగకరాజరాజిరా
జీవకుటీరధన్యఁ బరిశీలితవారిభరాజరాజిరా
జీవకిశోరసైన్యఁ గని చిత్తజుఁ బల్కు వసంతుఁ డయ్యెడన్.

96

కావేరీవర్ణనము

మ.

సుడియోదమ్ములుఁ దమ్మిపూఁబొదలు నాచున్బగ్గము ల్పూంచి న
ల్గడ సారంగపుదీము లుంచి దురితౌఘప్రౌఢసారంగముల్
పడఁ దోడ్తోఁ దెరలెత్తి మ్రోయఁ దొణఁగెం బైపై శరప్రౌఢి చొ
ప్పడ నీసహ్యధరాధరప్రభవశుంభద్వాహినిం గంటివే.

97


చ.

ఘనలహరీనినాదములు గర్జితము ల్సవి భీతిఁబొంది పైఁ
జనుకలహంసమండలముజాడ గనుంగొను మంగజాత యీ
యనుపమపుణ్యసింధుమణి యచ్ఛజలంబుల మున్గి ధన్యు లౌ
మనుజులఘోరపాతకసమాజము వెల్వడురీతిఁ దెల్పెడున్.

98


మ.

తెర సంధించి ప్రఫుల్లహల్లకశిఖాదీపచ్ఛట ల్నించి లోఁ
గర మర్థిన్ జలమానుషీప్రతిమలం గైసేసి యీసింధుసుం
దరి గంగావతరప్రసంగతకథానాట్యంబు సూప న్సురల్
సరవిన్ వైచునొసంగులో యనఁగ నంచల్ వ్రాలెడిం జూచితే.

99


సీ.

కవులకు జీవనక్రమ మొసంగినయట్టి యీసరస్వతి నుతియింపఁ దరమె
పరరాజహంసాళి భంగంబు నొందించు నీవాహినీలీల లెన్నఁ దరమె
యనిమిషప్రతతికి నమృతంబు లొనఁగూర్చు నీసింధుమౌళి నూహింపఁ దరమె
కాదంబవితతి నుత్కలికలఁ దేలించు నీహ్రాదినిమహత్త్వ మెన్నఁ దరమె