పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

సభ నహంకారములు పల్కఁజనదు కాక, విబుధవర్య భరద్వాజవిభ్రమంబుఁ
గోరి యిప్పుడె విటపాళిఁ గూర్పకున్న, నను విలాసిని యనుచు నెన్నంగవలదు.

87


సీ.

చవి చూచునే కదా సావిఁ గెంజిగురులు నాలేఁదొగరుమోవిఁ గ్రోలఁ డెట్లు
సరవి నుండునె కదా సైకతస్థలముల [1]నానితంబము డాయ మాను నెట్లు
తానమాడునె కదా తడయ కెప్పుడు నీట నాకమ్మఁజెమటల నానఁ డెట్లు
కలసియుండునె కదా వలపుఁబూఁదీవెల మత్తనూసంగతి మరగఁ డెట్లు
ముట్టునే కద మెట్టతమ్మలు మదీయ, చరణసంవాహనము సేయ మరగఁ డెట్లు
పలుపలుకు లాడ నేల మత్ప్రౌఢి నేఁడు, చిత్తగింపు మటన్న శచీవరుండు.

88


గీ.

మలినజలజాతమేని నీలలితకరస, మృద్ధి నలందె గడుసుఱాలేని నిన్నుఁ
గాంచినఁ గరంగవే చంద్రకళ ధరిత్రి, వ్రతుల వలపించు టెంతభారంబు నీకు.

89


క.

అని యనిమిషపతి తను దయఁ, గని తనచేఁ బసిఁడితట్టఁ గప్పురబాగా
లును దొడవు లొసఁగి యాసతిఁ, [2]బనిచినఁ దత్కార్యభారపరుఁ డై మరుఁడున్.

90


ఉ.

గ్రక్కున లేచి గద్దియ డిగన్ దివిజేంద్రుఁడు తోన డిగ్గి పే
రక్కున జేర్చి నాలుగయిదజ్జలు వెంటనె యేగుదెంచి నీ
నొక్కఁడ వుండ మేము సుఖముండుదు మెప్పుడు నేఁడు ప్రోవుమీ
దిక్కయి పంచబాణ యని దీవన లిచ్చిన సంతసంబునన్.

91


గీ.

అమరనాథుని వీడ్కొని యాలతాంగి, మొదలుగాఁగల తెఱగంటిముదిత లుదిత
ధృతులయి భజింపఁ బచ్చనితేజి నెక్కి, వెడలెఁ గలకంఠకంఠకాహళులు మొరయ.

92


సీ.

నిగనిగ మను గొప్పనిడుదయొంటులచాయ చెక్కుటద్దములపైఁ జీరువాఱఁ
జెమటచేఁ గరఁగి పూసినకదంబముచాయ యరచట్టలో నుండి పరిమళింపఁ
బలుకుఁగప్రపుఁదావి వలుచువీడెముకెంపుతేనె కెమ్మోవిపై నీనె చూపఁ
బరిజనంబులు వీచుసురటి తెమ్మెరలు బంగరువ్రాఁతకుళ్ళాయికళలు గదలఁ
జడిచెమట జిల్గుపావడఁ దుడిచికొనుచుఁ, గిరుదువాళినె పోనిచ్చ గెరలనీక
సంతరించుచు తనవాజినము తెఱింగి, యెక్కి యాడుచుఁ జనియె నాచక్కనయ్య.

93


మ.

విరిసెం బువ్వులు తేఁటిజోఁటిగమి యువ్విళ్లూర నందంద గా
డ్పరసెం దావులు చిల్వచెల్వపదు వఱ్ఱాడంగ లేవెన్నలల్

  1. క-మన్నితంబము
  2. చ-బనిచెన్ దత్కా