పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

కట్టికవారు సారె సముఖా యన వామపదంబు కెంపురా
మట్టిక నిల్చి గద్దెపయి [1]మార్పడ వేఱొకజాను వూఁది యా
పట్టవువేల్పు గొంతమురిపంబున నించుక లేచి కంతుఁ జే
ప ట్టిటు రమ్మటంచుఁ దనపార్శ్వమున న్వసియింపఁజేయుచున్.

79


చ.

పరమకుతూహలం బడరఁ బల్కు సుఖస్థితి నీదిశాంతపా
లురు నితరామరుల్ కడుపలోపలిచల్ల దొలంకకుండ ని
ర్భరులయి దండి దాడి యనుపల్కు లెఱుంగక నీడపట్టులన్
దొర లయి యుండు టెల్ల హరిదోర్బలశక్తిన కాదె మన్మథా.

80


చ.

అతనికిఁ బట్టి వీ వగుట నాపద లీసురరాజ్యవైభవ
స్థితి కితరంబు లేమి చనుదెంచిన నన్నియు మాన్ప విక్రమా
ప్రతిహత నీకునుం బడినభారము గావున రూపవిభ్రమాం
చితసురచంచలాక్షులు భజింపఁగ నేగి కవేరజాతటిన్.

81


మ.

వ్రతసంపత్తిఁ దపంబు సల్పెడుభరద్వాజాఖ్యమౌని న్భవ
చ్ఛితభల్లంబులపాలు సేసి లలనాశృంగారలీలాకళా
న్వితుఁ గావించి మదీయచిత్తజనితోద్వేగంబు మాయింపు మో
యతులప్రాభవదేవకార్యఘటనాయత్తప్రయత్నంబునన్.

82


[2]క.

విను మిఁక నేమనినఁ బ్రియం, బొనరించుట దోఁచు శక్తియుక్తుల నీయో
పినరీతిం బాటులుపడి,యనిమిషరాజ్యంబు నిలుపుమయ్య మనోజా.

83


గీ.

అనుచు ననునయించి యగభేది రంభాది, దివిజవనజముఖులదిక్కు చూచి
వనితలార యిందు మునినాథు వలపింపఁ, బడఁతి యొకతె యేఱుపడుఁడటన్న.

84


క.

వారలలో నతిలలితా, కారద్యుతిసాంద్రచంద్రకళ యనుసతి జం
భారాతియెదుట నిలిచి యు, [3]దారస్మితమాధురీసుధారస మెసఁగన్.

85


చ.

పలుకుల కేమి దేవ బలభంజన నీకృపపెంపున న్మహో
జ్జ్వలగతిఁ జేరఁబోయి [4]యలసన్నుతిశాలి మహర్షిధూర్జటిన్
సలలితనిష్కళంకరుచిసంపదఁ గైకొని ముజ్జగంబు "లీ
యలికులవేణి చంద్రకళ" యౌ నని మెచ్చ ఘటింతుఁ బంతముల్.

86
  1. చ-మార్కొన జానువు నూఁది యంత నా
  2. ట-లో నిది లేదు
  3. ట-దారస్థితి మధురమధుసుధారస మెసఁగన్.
  4. చ-మమ్ముఁ బ్రోవ నలసన్మతి