పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/5

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈయన కువలయానంద మనునలంకారగ్రంథమును వేంకటపతిరాయలనియోగముచేత రచియించిన ట్లాగ్రంథమందలి

“అముం కువలయానంద మకరో దప్పదీక్షితః
నియోగా ద్వేంకటపతే ర్నిరుపాధికృపానిధేః"

అనుశ్లోకమువలనఁ దెలియుచున్నది. తెనాలి రామకృష్ణకవి, చిన్ననారనకవి, మట్ల అనంతభూపాలకవియు నీకాలమువారే.

కృతివిషయము — శ్రీకృష్ణునకు సత్యభామయం దుదయించిన చంద్రభానుఁడు, రుక్మబాహునికూఁతు రగుకుముదిని యనుకన్యకను వివాహమైనకథ యిందు వర్ణింపఁబడినది. ఈకథకు మూల మేపురాణమం దున్నదో. జటప్రోలు సంస్థానాధిపతి యగు శ్రీసురభిమాధవరాయలను కవిరాజు చంద్రికాపరిణయ మను నొకప్రబంధరాజమును రచియించెను. దానికిని జంద్రభానుచరిత్రమునకును బోలికలు విశేషముగా నుండుటచే మాధవరాయలగ్రంథమును జూచి మల్లనకవియో మల్లనకవి గ్రంథముం జూచి మాధవరాయలో నిర్మించి యుందు రని తోఁపకమానదు. కృతినామమునఁ జంద్రపదము రెంటను గలడు. చంద్రికాపరిణయము నందలి నాయకుఁడు సుచంద్రుఁడు. చంద్రభానుచరిత్రము నందలినాయకుఁడు చంద్రభానుఁడు. అందలినాయిక చంద్రిక, యిందలినాయిక కుముదిని, చంద్రిక పూర్వభవమునఁ జిత్రలేఖ యనునచ్చర; వసంతుఁ డనుమునివరుతపంబునకు భీతిలిన నలువపంపునఁ దపోవిఘ్న మొనరింప నేగి పూనినపని సేయఁజాలక యామునిచే శప్త యై మానుషలోకంబున జనించినది. కుముదిని పూర్వజన్మమునఁ జంద్రకళ యనునచ్చర; భరద్వాజముని తపోభీతిచేఁ ద్రస్తుఁడగు సురరాజునానతిని దపోంతరాయం బాపాదించి శపింపఁబడి నరలోకమునఁ జనియించినది. చిత్రరేఖకు శతసహస్రవర్షంబులు మాత్రమే మనుష్యజన్మమును బిదప దేవత్వమును ముని నిర్ణయించెను. చంద్రకళ కట్లు మనుష్యజన్మమోక్ష మనుగ్రహింపఁబడలేదు. కావుననే కుముదినికి వీణ నేర్ప సురరాజు తుంబురు నంపి దివ్యగానము నేర్పించుటయే గాక స్వర్గవాసవరఫల మగుపారిజాతతరువునకు నిలయ మగుసత్యభామకుఁ గోడలిఁగా ఘటియించెను. చంద్రభానుచరిత్రములోని నాయకుఁ డొకపరి మృగయావినోదంబు సలువుచున్నతఱిఁ దుంబురునిస్నేహితుఁడు సిద్ధుఁ డొకఁ డేతెంచి మార్గమధ్యమం దున్నచంద్రభానునికిఁ దుంబురునియుఁ గుముదినియు వృత్తాంతములు వర్ణించి పోయెను. చంద్రికాపరిణయనాయకునకు శాండిల్యుఁ డనుమునినిదేశమ్మునఁ దమిస్రాసుర