పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/49

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లెడ కాఁపురము వానికుడియనుగుందమ్మితేనియ యేయూరితేటచెలమ
జేజేలకోరికల్ చేఁపెడినిచ్చయామనిగిడ్డి యేయూరిమందపసర
[1]మిచ్చమానిక మేయూరిరచ్చఱాయి
పెట్టెఱుఁగుమ్రాఁకు లేయూరిపెరటిచెట్టు
లట్టిసుర[2]పురి యేలుచు నమరపతి మ
హోన్నతైశ్వర్యదుర్యుఁ డై యొక్కనాఁడు.

66


చ.

సిరులఁ దనర్చు దివ్యసభఁ జేరఁగ వచ్చి పరాకు జియ్య యె
చ్చరిక యహో యటంచు సరసధ్వనితో నిరువంకలన్ బరా
బరు లొనరించుచుం బసిఁడిబ్రద్దలవారలు దెల్ప వేలుపున్
దొర లిరుగేలు ఖడ్గములతో మకుటంబుల నుంచి [3]కొల్వఁగన్.

67


గీ.

వచ్చి మించులు వెదచల్లునిచ్చమాని
కములగద్దియఁ గూర్చుండి యమరగురుఁడు
కవియుఁ బార్శ్వద్వయంబునఁ గదిసి బహున
యస్థితులు దెల్ప నాలించునవసరమున.

68


సీ.

సేనాని చిత్రవాజివిహారములఁ జేరె వలమానహేతియై వహ్ని వచ్చెఁ
జండాంశుతనయుఁ డుద్దండవైఖరి డాసె ఘనతమన్ఫూర్తి డగ్గఱె బలాశి
వాహినీశ్వరులతో వరుణుండు ననుదెంచె బహువాసనల గంధవహుఁడు గదిసెఁ
జెందె మహారాజసేవ్యుఁ డై ధనపతి గౌరీశుఁ డేతెంచెఁ గళ దొలంక
వెండియును దక్కినయశేషవిబుధవరులు, నిర్నిమేషప్రభావసందీప్తు లగుచు
నరుగుదెంచిరి సకలలోకాధిరాజ్య, రమ్యవిభవాభిరాము సుత్రాముఁ గొలువ.

69


సీ.

బహులక్షణానురూపప్రభావంబులఁ గనుపట్టుసుకవివాక్యములచేత
నరిదరకరమహిమాదాయకంబు లై తనరెడుగురునిమంత్రములచేత
శాస్త్రాధికరణచర్చాభీతవిమతమై కొఱలునూతనబుధగోష్ఠిచేత
శ్రుతహితపర్ణవిస్ఫురణమాధురిఁ జాల సొగయువిద్యాధరస్తుతులచేత
నుబుసుపోవఁ బురందరుఁ డూర్వశీశ
శిప్రభాహరిణీఘృతాచీతిలోత్త
మాప్రధానాప్సరోవధూమణులు గొలువ
నొనరి యొడ్డోలగంబయి యుండునపుడు.

70
  1. ట-ఇచ్చుమానిక
  2. ట-పుర మేలుచు
  3. మ్రొక్కఁగన్