పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/48

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జటిలశేఖర నీకృపాసక్తి నెచటు, పాత్రమై చిత్రమై యఘదాత్ర మయ్యె
నట్టినెలవులఁ గలవింత లానతిచ్చి, ననుఁ గృతార్థుని గాఁ జేయు మన నతండు.

58


ఉ.

భూవర సర్వపుణ్యపురము ల్దిలకించుచుఁ గుండినంబునం
గేవలరూఢి నారదుని గెల్చినగద్దఱిఁ దుంబురుం గళా
కోవిదుఁ గాంచి యందు నొకకొన్నిదినంబులు నిల్చి రంగధా
త్రీవిభుఁ గొల్వఁబోవుచు సుధీజనసేవిత నిన్ను గాంచితిన్.

59


చ.

అన హరిసూనుఁ డద్భుతము నంది మునీంద్ర సుధాశనాధినా
థునినెఱమెచ్చుగాణ యగుతుంబురుఁ డిత్తఱిఁ గుండినంబునం
దనిశము నున్కి కేమికత మానతి యి మ్మన సావధానత
న్విను మని పల్కె సంయమి నవీనవచోరచనాచమత్క్రియన్.

60


మ.

కలఁ డున్నిద్రజయప్రయాణపటిమాగ్రగ్రాహ్యవాహ్యాళికో
త్కళికాభంగతరంగసంఘపటురింఖాపుంఖసంఘాతని
ర్దళితక్షోణిరజోవ్రజావిలసముద్రస్వర్ధునీవ్యక్తదో
ర్భలసన్నాహుఁడు రుక్మబాహుఁడు కుభృత్పర్జన్యవాహుం డిలన్.

61


క.

అతనికి సుతుఁడును సుతయును, వితతయశుఁడు వీరసేనవిభుఁడుఁ గుముదినీ
సతియును గల రామకొరుఁడు, శతమఖముఖవినుతనిజభుజబలుఁ డనఘా.

62


సీ.

పుష్కరప్రౌఢిమ పొలఁతికేలన కాదు బెళుకు నెన్నడుమునఁ గలిగియుండు
నబ్జవిభ్రమము తన్వంగిగ్రీవన కాదు కలికినెమ్మొగమునఁ గలిగియుండు
విషధరప్రఖ్యాతి వెలఁదివేణిన కాదు మెలఁతలేయారునఁ గలిగియుండుఁ
జక్రవిలాసంబు సతిగుబ్బలన కాదు ఘనజఘనంబునఁ గలిగియుండు
నలప్రవాళప్రభావంబు చెలియపాద, ములన కా దధరంబునఁ గలిగియుండు
ననుచు వినుతింపఁ దనరు నయ్యధిపుపుత్త్రి, దివ్యవనితావతారైకభవ్య గాన.

63


క.

ఆరాజబింబవదన క, వారితసంగీతవైభవము నేర్ప సుధాం
థోరాజు పనిచె వీణా, సారస్యధురంధరాగ్రసరుఁ దుంబురునిన్.

64


గీ.

అనిన విని మహాత్మ యారుక్మబాహుభూ, కాంతమణికి నెట్టు కన్య యయ్యె
నమరకాంత యిది మహాద్భుతం బెఱిఁగింప, వే యటన్న సంయమీంద్రుఁ డనియె.

65


సీ.

వదరువట్రువహరివాణంబు గలమేటిబండికం డ్లేయూరిపాడిబంట్లు
లిబ్బిరాచూలి నేలినచాన మొదలైనపడఁతుక లేయూరిపడుపుఁగొమ్మ