పుట:చంద్రభానుచరిత్రము (తరిగొప్పుల మల్లన).pdf/47

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భసితచర్చికతో నిమ్మపంటిచాయ, దొరయు నెమ్మేనితోడ సిద్ధుఁ డొకండు
మిగులవేడుకఁ జెట్టున దిగినయట్టు, వచ్చె గొబ్బున నయ్యదువర్యుకడకు.

52


గీ.

వచ్చుటయుఁ గాంచి యెదురేగి తెచ్చి యొక్క
సితకరోపలసీమ నాసీనుఁ జేసి
యర్ఘ్యపాద్యాదిసత్క్రియ లాచరించి
యతిలలితవాక్యముల సేమ మరసి పలికె.

53


సీ.

తఱిమినారలు నిరంతరతమఃపటలంబు మస్తచంద్రప్రభామర్శనమున
యడఁచినారలు మహోదగ్రరజోరాశి విజ్ఞానధారాభివృష్టికతన
నాఁగినారలు సముద్య ద్వాయువలనంబు లీల మైఁ గుండలి మేలుకొలిపి
తొలఁచినారలు తనూమిళితపంకచయంబు లనితరసాధ్యామృతౌఘమహిమ
గణుతికెక్కి తపస్ఫూర్తిఁ గాంచినార, లనఘతరశీలహంసు లీ రగుటఁ జేసి
యట్టిమిముబోంట్ల వినుతి సేయంగఁ దరమె, భవుని కైనను బద్మసంభవుని కైన.

54


క.

భూచక్రభరణమదకృత, నీచతచేఁ జాల నెఱగొనినమాదృశులన్
వాచంయమి మీరు కృపం, జూచినఁ గా కేల కలుగు శుభవైభవముల్.

55


[1]గీ.

అనిన మందస్మితము కనుంగొనలఁ దొలఁక, సర్వసర్వంసహాభారసహనదక్ష
బాహుశాలికి నాసత్యభామసుతున, కనియె యతి మత్తకేసరిస్వనము మీఱ.

56


సీ.

ప్రతిమానసాంభోజసతతవికాసశీలనవిచక్షణుఁ డెన్న నినుఁడు గాఁడె
యభ్యుపగక్షుత్తమోహంక్రియావిదారణసమర్థుం డెన్న రాజు గాఁడె
జటిలాపదహిగర్వసర్వస్వవిదళనధుర్యుఁ డెన్నఁగ నరేంద్రుండు గాఁడె
శమిరాజనిర్వ్యాజసౌఖ్యవాసవిధాయకుం డెన్న నచలేశ్వరుండు గాఁడె
యఖలయతిమానసోత్తరాశావలంబ, ముఖ్యుఁ డెంచిన సార్వభౌముండు గాఁడె
కాన మముబోంట్ల నీవును గారవింప, వలయు నన విని యదువంశవల్లభుండు.

57


సీ.

సంయమి మీకటాక్షమున నెచ్చో టతిసౌమ్యమై రమ్యమై గమ్య మయ్యె
మౌని నీసంస్థానమహిమ నెచ్చో టస్తదైన్యమై మాన్యమై ధన్య మయ్యె
యతి నీపదాబ్జసంగతుల నెచ్చోటు సత్సేవ్యమై దివ్యమై భవ్య మయ్యె
వ్రతి నీమనఃప్రసన్నతల నెచ్చోటు వరేణ్యమై పుణ్యమై గణ్య మయ్యె

  1. ఈ పద్యము మొదలు "జాళువాగోణపుఁజెఱంగు" అనువఱకు క-లో లేదు.